ములుగులో దారుణం.. మేడారంలోని గోవిందరాజుల గద్దె పూజారి గబ్బగట్ల రవి హత్య..

By Asianet NewsFirst Published Mar 22, 2023, 8:32 AM IST
Highlights

ములుగు జిల్లాలోని మేడారం గోవిందరాజుల గద్దె పూజారిగా వ్యవహరిస్తున్న గబ్బగట్ల రవి హతమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ములుగు జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. మేడారం గోవిందరాజుల గద్దె పూజారి హత్యకు గురయ్యారు. అతడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి చంపేశారని పోలీసులు తెలిపారు. మృతుడిని గబ్బగట్ల రవిగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గబ్బగట్ల రవి స్వగ్రామం ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామం. అయితే అతడు తన భార్య ఊరైన మేడారంలో కొంత కాలం కిందట స్థిరపడ్డారు. వీరి కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో గోవిందరాజుల గద్దె పూజారులుగా వ్యవహరిస్తున్నారు.

జగిత్యాలలో విషాదం.. క్రికెట్‌ ఆడుతుండగా ఆగిన యువకుడి గుండె

ఈ కుటుంబానికి చెందిన వ్యక్తులు వారానికి ఒకరు చొప్పున మేడారంలోని గోవిందరాజుల గద్దె వద్ద పూజలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే తన వారం వచ్చినప్పుడల్లా రవి గద్దె వద్దకు వెళ్తారు. భక్తులకు బొట్టు పెడుతూ పూజలు నిర్వహిస్తుంటారు. స్థానికంగా గుర్తింపు ఉన్న రవి హత్యకు గురవడం కలకలం రేకెత్తించింది. ఘటనాపై సమాచారం అందుకున్న వెంటనే సీఐ శంకర్, ఎస్సై వెంకటేశ్వరరావులు అక్కడికి చేరుకున్నారు. వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

రజనీకాంత్ కుమార్తె ఇంట్లో భారీ చోరీ.. పనిమనిషి, డ్రైవర్ అరెస్ట్..

గబ్బగట్ల రవి హత్యకు గురవ్వడానికి ముందు ఓ బైక్ మేడారంలో తిరిగారని స్థానికులు చెబుతున్నారు. ఆ బైక్ పై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. వారి మద్యం కూడా తాగారని, ఇద్దరిలో ఒకరు మహిళ ఉన్నారని చెప్పారు. పోయిన పర్సును వెతుకుదామంటూ అతడిని బైక్ పై ఎక్కించుకెళ్లారని, ఈ విషయంలో స్థానికులను కొందరిని ఆరా కూడా తీశారని తెలుస్తోంది.

ప్రధాని మోదీని 'అన్నయ్య' అని సంబోధించిన కేజ్రీవాల్.. కారణమేంటీ?

వీరంతా కలిసి రోడ్డు పక్కన ఉన్న షెడ్డులో సోమవారం రాత్రి వంట చేసుకున్నారని, మద్యం తాగిన తరువాత రవిపై బండరాళ్లతో దాడి చేశారని పోలీసులు అనుకుంటున్నారు. అయితే మృతుడి చెప్పులు ఘటనా ప్రదేశానికి దూరంగా పడి ఉన్నాయి. దీంతో వారి మధ్య అంతకు ముందు గొడవ జరిగి ఉంటుందేమో అని భావిస్తున్నారు. కాగా.. వారితో రవికి గతంలోనే పరిచయం ఉందా ? లేదా అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. 
 

click me!