ఢిల్లీ లిక్కర్ స్కాం : ముగిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ... 7 గంటలకుపైగా ప్రశ్నల వర్షం

Siva Kodati |  
Published : Dec 11, 2022, 07:26 PM ISTUpdated : Dec 11, 2022, 07:27 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం : ముగిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ... 7 గంటలకుపైగా ప్రశ్నల వర్షం

సారాంశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ముగిసింది. దీంతో ఆమె ఇంటి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు చేరుకున్నారు. అయితే కవిత విచారణకు సంబంధించి సీబీఐ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ముగిసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు దాదాపు 7 గంటలకు పైగా కవితను ప్రశ్నించింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆమె నుంచి సీబీఐ అధికారులు రాబట్టినట్లుగా తెలుస్తోంది. అవసరమైతే మళ్లీ విచారించే అవకాశం కనిపిస్తోంది. 

ఇదిలావుండగా.. కవిత  నుండి సమాచారం సేకరించేందుకు గాను  సీబీఐ అధికారులు రావడానికి అరగంట ముందే  న్యాయవాదులు  కవిత ఇంటికి వచ్చారు. సీబీఐ అధికారులు కవిత న్యాయవాది సమక్షంలో ఈ విషయమై సమాచారాన్ని సేకరిస్తున్నారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో   ఈడీ అధికారులు అరెస్ట్  చేసిన అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో కవిత  పేరు ఉంది. అమిత్ ఆరోరా  రిమాండ్ రిపోర్టు  వెలుగు చూసిన మరునాడే  కవితకు సీబీఐ అధికారులు  నోటీసులు జారీ చేశారు.  160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులిచ్చారు. ఈ నోటీసులకు ఈ నెల 6వ తేదీన  తాను  సిద్దంగా ఉంటానని కవిత  తొలుత సమాచారం ఇచ్చారు.

Also Read:ఢిల్లీ లిక్కర్ స్కాం: లంచ్ తర్వాత కవిత నుండి స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్న సీబీఐ

ఈ నెల 3వ తేదీన ఉదయం ప్రగతి భవన్ లో  కేసీఆర్ ,కవితలు న్యాయ నిపుణులతో ఈ విషయమై చర్చించారు.  ఈ చర్చలు ముగిసిన తర్వాత  సీబీఐకి  కవిత లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించి  చార్జీషీట్, ఎఫ్ఐఆర్‌ను పంపాలని కవిత లేఖ రాసింది. ఈ లేఖలకు సంబంధించి సీబీఐ కవితకు సమాచారం పంపింది. అయితే ఎఫ్ఐఆర్, చార్జీషీట్లలో తన పేరు లేదని కవిత పేర్కొన్నారు. అంతేకాదు  ఈ విషయమై  సీబీఐకి సహకరిస్తానని కవిత  స్పష్టం చేశారు. ఈ నెల 11,12, 14, 15 తేదీల్లో  తాను హైద్రాబాద్ లో ఉంటానని  సీబీఐకి సమాచారం పంపారు.  ఈ సమాచారంపై సీబీఐ అధికారులు ఈ నెల 6వ తేదీన స్పందించారు. ఈ నెల  11న సమాచార సేకరణకు వస్తామని కవితకు  సీబీఐ అధికారులు మెయిల్ ద్వారా సమాచారం పంపారు. ఈ కేసులో సమాచార సేకరణలో భాగంగా  కవిత  ఇంటికి ఇవాళ సీబీఐ అధికారుల బృందం  వచ్చింది.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu