రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో బీఆర్ఎస్ అగ్రనేతలు, స్వయంగా బావాబామ్మర్దులు హరీష్‌రావు, కేటీఆర్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరూ తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో ప్రయాణించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే విపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందాయి. దీంతో బీఆర్ఎస్ అగ్రనేతలు, స్వయంగా బావాబామ్మర్దులు హరీష్‌రావు, కేటీఆర్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వీరు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న విషయమే ఇక్కడ చర్చనీయాంశమైంది.
కేటీఆర్, హరీశ్ ఇద్దరూ తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో ప్రయాణించారు. కేటీఆర్ స్వయంగా డ్రైవింగ్ చేస్తుండగా.. హరీశ్ ఆయన పక్కొన కూర్చొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను హరీశ్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేశారు. దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తుంటి ఎముకకు గాయం కావడంతో సర్జరీ నిర్వహించారు. చంద్రశేఖర్ రావు కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం వుండటంతో బీఆర్ఎస్‌ను కేటీఆర్, హరీశ్‌లే నడిపిస్తున్నారు. ఇద్దరూ వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు.
Enroute to Rashtrapati Nilayam, Bolarum along with Sri to attend the 'At Home' reception hosted by Hon‘ble President of India. pic.twitter.com/aN5O39L6dS
— Harish Rao Thanneeru (@BRSHarish)