చేతకానోళ్లే తొడలు కొడతారు.. మీసాలు తిప్పుతారు : కొండా మురళీపై చల్లా ధర్మారెడ్డి విమర్శలు

Siva Kodati |  
Published : Sep 06, 2023, 08:26 PM IST
చేతకానోళ్లే తొడలు కొడతారు.. మీసాలు తిప్పుతారు : కొండా మురళీపై చల్లా ధర్మారెడ్డి విమర్శలు

సారాంశం

చేతకానోళ్లే తొడలు కొడతారని, మీసాలు తిప్పుతారంటూ  కాంగ్రెస్ నేత కొండా మురళీపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. పరకాలలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం వుందని.. దీనిని చెడగొట్టొద్దన్నారు.

కాంగ్రెస్ నేత కొండా మురళీపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేతకానోళ్లే తొడలు కొడతారని, మీసాలు తిప్పుతారంటూ చురకలంటించారు. పరకాలలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం వుందని.. దీనిని చెడగొట్టొద్దన్నారు. తెలంగాణలో 24 గంటలు నిరాంతరాయంగా విద్యుత్ ఇస్తున్నామని, దీనిని చూసి దేశం ఆశ్చర్యపోతోందన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మీ పథకాలు వున్నాయా అని చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. ధరణి పోర్టల్ భారతదేశంలోనే అద్భుతమన్నారు. కాంగ్రెస్ నేతల ఆటలు సాగడం లేదనే ధరణి తీసేస్తామని అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ధాల పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఏనాడూ 24 గంటల విద్యుత్ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని ధర్మారెడ్డి సూచించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం
IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు