తాండూరులో తనతో పాటు మరికొందరు బిఆర్ఎస్ అభ్యర్ధులు ఓడిపోవడానికి సొంత పార్టీలోని ఓ నాయకుడే కారణమంటూ పైలట్ రోహిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
తాండూరు : ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్ కు గ్రూప్ రాజకీయాలు తలనొప్పిగా మారాయి. లోక్ సభ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ పార్టీలో అంతర్గత విబేధాలు బయటపడుతుండటం అదిష్టానాన్ని కలవరపెడుతోంది. ఇలా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వ్యవహారం చేవెళ్ల లోక్ సభలో బిఆర్ఎస్ ను దెబ్బతీసేలా వుంది. ఇరువును నాయకుల మధ్య మరోసారి మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బిఆర్ఎస్ పెద్దల ముందే బాహాబాహీకి దిగిన వీరు తాజాగా ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణల చేసుకుంటున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి కొందరు ద్రోహం చేసారని... వారు ఎంతటి హోదాలో వున్నా వదిలిపెట్టబోనంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ నేత ఒకరు రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అయ్యారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఈ రహస్య సమావేశం జరిగిందని ... తర్వాతే బిఆర్ఎస్ అభ్యర్థులను ఓఢించేందుకు సదరు నేత పనిచేయడం ప్రారంభించాడని అన్నారు. ఆ నాయకుడు బిఆర్ఎస్ పెద్దలకు కూడా తెలుసు... త్వరలోనే ఆయనెవరో బయటపెడతానని రోహిత్ రెడ్డి తెలిపారు.
తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి బహుమతిగా ఇస్తానని సదరు నేత రేవంత్ రెడ్డికి చెప్పారని ... అన్నట్లుగానే చేసాడని రోహిత్ అన్నారు. తాండూరు, వికారాబాద్, కొడంగల్ లో బిఆర్ఎస్ ఓటమికి కారకులెవరో... పార్టీలోనే వుండి కాంగ్రెస్ కోసం పనిచసింది ఎవరో అదిష్టానానికి తెలుసన్నారు. ఈ విషయంపై పార్టీ పెద్దలతో సమయం వచ్చినపుడు మాట్లాడతానని రోహిత్ రెడ్డి తెలిపారు.
Also Read బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు ...
ఇలా తనతో పాటు మరికొందరు బిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడానికి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పనిచేసారని పరోక్ష వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డితో కలిసి మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ కు ద్రోహం చేసాడని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఓడినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసినా మహేందర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ కోసమే పనిచేసాడు అనేలా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కామెంట్స్ చేసారు.