బీఆర్ఎస్ నేతల భూకబ్జాల పాపమే.. ఈ వరదలు: ప్రొఫెసర్ కోదండరామ్ ధ్వజం

బీఆర్ఎస్ నేతలు చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని టీజేఎస్ చీఫ్ ప్రొ. కోదండరామ్ ఆరోపణలు చేశారు. అందువల్లే వరద నీరు రోడ్లపైకి వచ్చి నిలుస్తున్నదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ అభివృద్ధిని పట్టించుకోలేదని పేర్కొన్నారు.
 


హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సాధనలో కీలక పాత్ర పోషించిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజులుగా భీకరంగా కురిసిన వర్షంతో రాజధాని నగరంలో చాలా వరకు రోడ్లు నీటిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. వరద నీరు ఇలా రోడ్లపైకి రావడానికి బీఆర్ఎస్ నేతల భూకబ్జాలే కారణం అని కోదండరామ్ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలు చెరువుల, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు.

రాజధాని నగరం హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామని, న్యూయార్క్ చేస్తామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పారని కోదండరామ్ మండిపడ్డారు. కానీ, వాస్తవంలో అందుకు విరుద్ధంగా ఉన్నదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. వాటి ఫలితంగానే వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరుతున్నదని పేర్కొన్నారు.

Latest Videos

Also Read: నిజామాబాద్ IT Hubలో కంపెనీ పెట్టడానికి గ్లోబల్ లాజిక్ సంస్థ సానుకూలం: కంపెనీ ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత భేటీ

నాంపల్లిలో సోమవారం నిర్వహించిన ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొ. కోదండరామ్ హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అలాగే.. ఇటీవల చర్చనీయాంశమైన గురుకుల పరీక్షల గురించి మాట్లాడారు. ఒక్కో పేపర్ ఒక్కో చోట నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. అభ్యర్థుల్లో మహిళలు, గర్బిణీలు ఉన్నారని, అందరినీ దృష్టిలో పెట్టుకుని పరీక్షలను ఒకే చోట నిర్వహించాలని ప్రభుత్వానికి సూచనలు చేశారు.

click me!