Vijaya Shanthi: అవినీతి బీఆర్‌ఎస్‌ను శిక్షించడానికి బీజేపీ చేసిందేమీ లేదు.. కాషాయ పార్టీపై విజయశాంతి ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Nov 21, 2023, 5:18 AM IST

Telangana Congress: తెలంగాణల మతవిద్వేషాలు రెచ్చగొడుతూ.. ఆ విద్వేషాల విధానంపైనే నడిచే ఎంఐఎంను, అన్నిచోట్లకు తెచ్చి, ప్రశాంతమైన పల్లెల నెత్తిన కొట్లాటల కుంపటి తెస్తారా? అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కాంగ్రెస్ నాయ‌కురాలు  విజ‌య‌శాంతి ప్ర‌శ్నించారు. 
 


Telangana Assembly Elections 2023: బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తాను పార్టీ మారినట్లు వస్తున్న విమర్శలపై సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు . పార్టీ మారడంపై విమర్శలు చేసే వారు ఒక్కటి తెలుసుకోవాలనీ, బీఆర్‌ఎస్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర బీజేపీ నేతలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అందుకే తాను పార్టీ మారాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీకి మీరంతా మద్దతిస్తే దేనికైనా పోరాడతామని వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను ఒప్పించానని ఆమె అన్నారు. ఈ మేరకు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు ఆమె వద్దకు వచ్చి పలుమార్లు చెప్పారు.

బీఆర్‌ఎస్‌తో బీజేపీకి ర‌హ‌స్య ఒప్పందం కుదిరిందని తెలిస్తే.. ఈ నేతలు రాజీనామాలు చేసి వెళ్లిపోయారని ఆమె విమర్శించారు. బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకుంటామని కేంద్ర పెద్దలు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆమె  ప్ర‌శ్నించారు. ఇప్ప్పుడు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణలో దుర్మార్గపు పాలన పారదోలాలనీ, పోరాడి సాధించుకున్న తెలంగాణ బాగుండాలనే ఏకైక కారణంతోనే తాను ఇన్నాళ్లు పనిచేసిన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరానని ఆమె పేర్కొన్నారు. అయితే బీజేపీ నేతలు మాట నిలబెట్టుకోకుండా తనను మోసం చేశారని విజయశాంతి వివరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడేళ్లు జెండాను పట్టుకుని పోరాడానని ఆమె అన్నారు.

Latest Videos

"దశాబ్దాల నాటి భైరాన్‌పల్లి సంస్మరణదినం, ఆ తర్వాత, ప్రతి మండలం, పల్లెలల్ల స్మారకాలు.. ఈ అంశాలన్నిటి పట్ల ఇప్పటి ప్రజలకు ఏ భావోద్వేగం ఉండాలనే ప్రయత్నం మీది? అమిత్ షా గారూ?" అని ప్ర‌శ్నించారు. "ఎప్పుడో నాటి సమాజం ఉన్న పరిస్థితులు, విద్య, ఉద్యోగం లేని జీవన ప్రమాణాలు, బతుకుతెరువు, ఆధిపత్య సంస్కృతి వేరు.. ఇయ్యాల్టి సమాజం, ప్రపంచం వేరని" పేర్కొన్నారు. "సమకాలీన సమాజ అసమానతలు, మత విశ్వాసాల ఆధారంగా ఏర్పడుతూ, ఏర్పరుస్తూ వస్తున్న విభేదాలను సముదాయించి, సమన్వయం చెయ్యటం ద్వారా బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి దారి చూపగలదు గానీ, దశాబ్దాల.. పురాతన సంఘటనలను తిరిగి జనహృదయంలోకి తేవడమనే చర్య, ఎన్నికల అవసరార్ధం చేసే ప్రయత్నమే అయితదని" అన్నారు.

click me!