
సిల్ల్వర్ జూబ్లీ వేడులకు కవిత హాజరయ్యారు. ఆమెరాకను తెలుసుకున్న నేతలు.. ఎంట్రీ సాంగ్ పాడాలని ఓ సింగర్‌కు నిర్వాహకులు చెప్పారు. అతను వేదికపైకి వచ్చి పాట పాడుతున్న తరుణంలో పార్టీలోని ఓ గ్రూపునకు చెందిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే బౌన్సర్లను పిలిపించి ఆ సింగర్‌ను స్టేజి మీద నుంచి కిందకి దింపించేశారు. ఈ ఘటన చూసిన గులాబి నేతలు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. పార్టీ పరువును తీస్తున్నారని చర్చించుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీఆర్‌ఎస్‌లో రెండు, మూడు గ్రూపులు ఉన్నాయని ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. కవితను ఓ వర్గం ఎప్పిటినుంచో వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన రజతోత్సవ సభలో ఆ గొడవలు బహిర్గతమయ్యాయి. కవిత పాట పాడకుండా మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ అడ్డుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఎన్నికలకు ముందు కవితపై ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతోపాటు పలు అవినీతి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. కవిత వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందని బీఆర్‌ఎస్‌లో ఓ వర్గం ఫీలవుతోందట. ఈక్రమంలో ఆమె ప్రాధాన్యం తగ్గించే పనిలో వారు ఉన్నారు.
2014లో కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కవిత గెలుపొందారు. ఇక 2019లో కేసీఆర్ సర్కర్ అధికారాన్ని నిలబెట్టుకుంది. కానీ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి కవిత ఓడిపోయింది. తర్వాత... ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కేసీఆర్ క్యాబినెట్‌లో కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావులు మంత్రులు అయ్యారు. ఆయన మరో మేనల్లుడు సంతోష్ రావును రాజ్యసభకు పంపారు. దీంతో కేసీఆర్ ఫ్యామిలీలో అందరికి ఉద్యోగాలు వచ్చాయని కాంగ్రెస్, బీజేపీ పెద్దఎత్తున విమర్శలు చేశారు.
ఇటీవల కవిత ఓ ఇంటర్వ్యూలో సైతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి చులకనగా మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ఆమె రాజకీయ స్టేట్‌మెంట్లు కూడా ఘాటుగా ఉంటున్నాయి. ఇవి పార్టీకి డ్యామేజ్ చేస్తాయని బీఆర్‌ఎస్‌లో ఓ వర్గం చర్చించుకుంటోంది. దీంతోపాటు ఇప్పటికే కేసీఆర్ ఇంట్లో కేటీఆర్, హరీశ్ రావ్ కీలక పదవుల్లో ఉన్నారు. మద్యం మాఫిలో ఆరోపణలు ఎదుర్కొన్న కవిత ఈమధ్య కాలంలో సైలెంట్‌గా ఉండి రీసెంట్‌గా యాక్టివ్ అయ్యారు. ఈక్రమంలో పార్టీలో కొందరి నేతలకు ఆమె తీరు నచ్చడం లేదు. దీంతోపాటు గ్రూపు రాజకీయాలు నడిపిస్తోందని ఆమెపై అనేక ఆరోపణలు చేస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు.