Kamareddy: కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలోని హత్ సే హాత్ జోడో' ప్రచారం నిర్వహించారు. వందలాది మంది పార్టీ కార్యకర్తలు, మహిళల, యువకుల ఉత్సాహభరితమైన పరిస్థితుల మధ్య మహ్మద్ అలీ షబ్బీర్‌కు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ బీఆర్ఎస్ గత తొమ్మిదేళ్లుగా ప్రజా సమస్యలను విస్మరించిందని ఆరోపించారు.
Congress leader-former minister Mohammad Ali Shabbir: కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలోని హత్ సే హాత్ జోడో' ప్రచారం నిర్వహించారు. వందలాది మంది పార్టీ కార్యకర్తలు, మహిళల, యువకుల ఉత్సాహభరితమైన పరిస్థితుల మధ్య మహ్మద్ అలీ షబ్బీర్‌కు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార పార్టీ బీఆర్ఎస్ గత తొమ్మిదేళ్లుగా ప్రజా సమస్యలను విస్మరించిందని ఆరోపించారు.
వివరాల్లోకెళ్తే.. 'హత్ సే హత్ జోడో' ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మహ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ముమ్మరంగా జన సంపర్క ప్రచారాన్ని ప్రారంభించారు. వందలాది మంది పురుషులు, మహిళల ఉత్సాహభరిత జనసందోహం మధ్య, రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ మద్దతును కూడగట్టుకుంటూ ప్రజలతో మమేకమైన మహమ్మద్ అలీ షబ్బీర్ కు సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లుగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రజాసమస్యలను విస్మరించారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నారు. పెరుగుతున్న ప్రజా సెంటిమెంట్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోందన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్, బీజేపీలపై అసంతృప్తి ఉందని షబ్బీర్ పేర్కొన్నారు.
మైనార్టీలు, దళితులు, వెనుకబడిన తరగతులు సహా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వదిలేశారని ఆరోపిస్తూ కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై మహమూద్ అలీ షబ్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో వంటగ్యాస్ సిలిండర్లను రూ.500లకు విక్రయిస్తున్నారనీ, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులతో పోల్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుపేద కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే, రైతులు, బడుగు బలహీన వర్గాల కోసం ప్రత్యేక డిక్లరేషన్లు విడుదల చేయడం ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నారనే వార్తలపై స్పందించిన షబ్బీర్.. పోటీని స్వాగతిస్తానని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల గెలుపుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుంది పేర్కొన్నారు.