విపక్ష పార్టీలు, ప్రధానంగా ఇప్పుడు బలంగా తయారైన కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నేతలు పోటీ చేయనున్న 25 కీలక అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించారు బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ . అగ్రశ్రేణి విపక్ష నేతలు పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవడానికి బీఆర్ఎస్ అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాతావరణం హాట్ హాట్‌గా మారింది. అభ్యర్ధులు ఇంటింటి ప్రచారం చేపట్టగా.. వారికి మద్ధతుగా అగ్రనేతలు సైతం రంగంలోకి దిగారు. ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం వుండటంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంతా భావిస్తున్నారు. అలాగే ప్రత్యర్ధులను కార్నర్ చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. అన్ని పార్టీలకు చెందిన కీలక నేతలు బరిలోకి దిగే స్థానాలపై అందరి చూపు పడింది.
ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ తన ప్రచారం ముమ్మరం చేసి ప్రత్యర్ధులపై ఆధిక్యత సాధించేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా విపక్ష పార్టీలు, ప్రధానంగా ఇప్పుడు బలంగా తయారైన కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నేతలు పోటీ చేయనున్న 25 కీలక అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్న దానిని బట్టి.. అగ్రశ్రేణి విపక్ష నేతలు పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవడానికి బీఆర్ఎస్ అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది.
Also Read: రెండు సీట్ల కేటాయింపు హామీని కాంగ్రెస్ నిలుపుకుంటుంది: సీపీఐ కార్యదర్శి కూనంనేని
రాష్ట్రంలోని కొడంగల్, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, నల్గొండ, ములుగు, మధిర, పాలేరు, ఖమ్మం, మంథని, జగిత్యాల, ఆందోల్, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, పాలకుర్తి, వరంగల్ తూర్పు, పశ్చిమ, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, హుజూరాబాద్, హుజూరాబాద్ అంబర్‌పేట్, కరీంనగర్‌లపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి, రాజేశ్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, యశస్వి రెడ్డి, కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సునీల్ రెడ్డి, వింజయ్ రెడ్డి, ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌లను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది.
ఈ కీలక నేతలు వారి వారి నియోజకవర్గాలకే పరిమితమయ్యేలా వ్యూహాలు రచిస్తోన్నట్లుగా సమాచారం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలపై బీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. దీనిని మరోసారి పునరావృతం చేయాలని అధికార పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. విపక్ష అభ్యర్ధులను కార్నర్ చేస్తూనే, తన ఎమ్మెల్యేల లోపాలను గుర్తించడం ద్వారా కీలకమైన సెగ్మెంట్లలో ఆపరేషన్ ఆకర్ష్‌ను ముమ్మరం చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్ నాయకులను ఈ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.