బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేపాల్‌లో పోలీసులకు చిక్కినట్టు సమాచారం అందింది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత కేసు నమోదైంది. అనంతరం, ఆయన కనిపించకుండా పోయారు.
Balka Suman: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరారీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేశారు. ఆ తర్వాత సుమన్ పై కేసు నమోదైంది. తదనంతరం బాల్క సుమన్ కనిపించకుండా పోయారు. తాజాగా, ఆయన నేపాల్‌లో కనిపించినట్టు వార్తలు వస్తున్నాయి. పోలీసులు బాల్క సుమన్‌ను నేపాల్‌లో గుర్తించినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెప్పు చూపించి దూషించారు. ఆయన చర్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. కాంగ్రెస్ నేతలు బాల్క సుమన్ పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి బాల్క సుమన్‌ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అదే సమయంలో బాల్క సుమన్ కనిపించకుండా పోయారు.
undefined
Also Read: Explainer: పార్లమెంట్ క్యాంటీన్‌లో టీడీపీ, బీజేడీ, బీఎస్పీ ఎంపీలతో ప్రధాని లంచ్.. అసలు మతలబు ఇదేనా?
ఆయన హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ మీదుగా నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌కు పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.