బిఆర్ఎస్ కు వింత పరిస్థితి : వున్నదంతా ఆ పాార్టీ కార్పోరేటర్లే... కానీ మేయర్ పదవి పోయింది...

By Arun Kumar P  |  First Published Feb 20, 2024, 9:00 AM IST

ఇప్పటికే అధికారాన్ని కోల్పోయి ఢీలాపడ్డ బిఆర్ఎస్ కు కాంగ్రెస్ షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. ఎక్కడికక్కడ బిఆర్ఎస్ ను దెబ్బతీస్తూ కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతోంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో కాంగ్రెస్ బలోపేతానికి సరికొత్త రాజకీయాలకు తెరతీస్తున్నారు.  


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారం కోల్పోవడంలో బిఆర్ఎస్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంతకాలం అదిష్టానం నిర్ణయానికే కట్టుబడిన నాయకులు ఇప్పుడు తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు... పార్టీ లైన్ దాటుతున్నారు. హైదరాబాద్ శివారులోని జవహర్ నగర్ బిఆర్ఎస్ కార్పోరేటర్లు ఇదే పని చేసారు. సొంత పార్టీ మేయర్ పైనే అవిశ్వాసం పెట్టి విజయం సాధించారు. 

జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ 28 కార్పోరేటర్లు బిఆర్ఎస్ కు చెందినవారే. వీరిలో చాలామంది సొంత పార్టీ మేయర్ మేకల కావ్యపై తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఇక ఇటీవల బిఆర్ఎస్ అధికారంలోకి కోల్పోవడంతో ఇదే అదునుగా మేయర్ పై అసంతృప్తిని బయటపెట్టారు. ఇలా 20మంది బిఆర్ఎస్ కార్పోరేటర్లు సొంత పార్టీ మేయర్ పైనే అవిశ్వాసం ప్రకటించారు.  

Latest Videos

undefined

అయితే తాజాగా కార్పోరేటర్ల అవిశ్వాసం నెగ్గి మేకల కావ్య మేయర్ పదవిని కోల్పోయారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 20మంది కార్పోరేటర్లు మేయర్ వ్యతిరేకంగా చేతులెత్తారు... దీంతో అవిశ్వాసం తీర్మానం నెగ్గింది. అయితే ఇప్పుడు బిఆర్ఎస్ కార్పోరేటర్లు  ఏం చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. 

Also Read  Delhi: సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ అందుకేనా.. ?

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినా జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం చతికిలపడింది.హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క సీటుకూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది...  ఇక్కడ బిఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. దీంతో హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ చేరికలను ప్రోత్సహిస్తోంది.  ఇలా ఇప్పటికే అనేకమంది కాంగ్రెస్ కండువా కప్పుకోగా తాజాగా జవహర్ నగర్ కార్పోరేటర్లు కూడా కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి కనుసన్నల్లోనే జవహర్ నగర్ అవిశ్వాస ప్రక్రియ సాగిందని... త్వరలోనే అక్కడ కాంగ్రెస్ మేయర్ కొలువుదీరనున్నారని ప్రచారం జరుగుతోంది. 
 

click me!