తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నారు. అభ్యర్థుల లిస్ట్ పేరు ప్రకటించి భీఫామ్ మాత్రం వేరేవాళ్లకు ఇచ్చిన వింత పరిస్థితి బిఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎదురయ్యింది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎప్పుడు ఏ రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. కొందరు సీటు దక్కలేదని అసంతృప్తితో పార్టీ వీడితే మరికొందరు సీటు దక్కినా పార్టీని వీడుతున్నారు. టికెట్ వచ్చినా పోటీ నుండి తప్పుకుంటున్నవారు ఇంకొందరు. మరికొందరు నాయకుల పరిస్థితి మరీ దారుణం... సీటు దక్కినట్లే దక్కి నామినేషన్ల వేళ క్యాన్సిల్ అవుతోంది. ఇప్పటికే తమకు సీటు కన్ఫర్మ్ అవడంతో ప్రచారం ప్రారంభించి నామినేషన్లకు సిద్దమవుతున్నవారికి పార్టీలు షాకిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే నామినేషన్ల ప్రక్రియ ముగిసేవరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని అర్థమవుతోంది.
తాజాగా ఆలంపూర్ బిఆర్ఎస్ లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరు ఖరారయ్యింది. దీంతో ఆయన ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గంలో బిజీబిజీగా వున్నారు. నామినేషన్ కోసం సిద్దమవుతున్న అబ్రహంకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాకిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ను క్యాన్సిల్ చేసి కొత్తవారికి అవకాశం కల్పించారు.
మంగళవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొందరు బిఆర్ఎస్ అభ్యర్థులకు భీఫామ్స్ అందించారు. ఇలా ఆలంపూర్ అభ్యర్థికి కూడా భీఫామ్ అందించారు... కానీ ముందుగా ప్రకటించిన సిట్టింగ్ కు కాకుండా మరో నాయకుడికి బీఫామ్ అందించారు. ఎమ్మెల్యే అబ్రహం స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజెయుడికి కేటీఆర్ భీఫామ్ అందించారు. దీంతో అబ్రహంతో పాటు ఆయన వర్గం షాక్ కు గురయ్యింది.
Read More పవన్ కల్యాణ్ పై ప్రధాని మోదీ ఆప్యాయత... ఉప్పొంగిపోతున్న జనసైనికులు, మెగా ఫ్యాన్స్
ఆలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని... అయితేనే పార్టీ గెలుపు సాధ్యమని సీఎం కేసీఆర్ ను ఆయన సూచించినట్లు తెలుస్తోంది. దీంతో మొదట ప్రకటించిన అబ్రహంకు కాదని చల్లా వర్గానికే చెందిన విజేయుడికి ఆలంపూర్ టికెట్ ఇచ్చి బరిలోకి దింపారు కేసీఆర్. ముఖ్యమంత్రి ఆదేశాలతో కేటీఆర్ నిన్న అజేయుడికి భీఫామ్ అందించారు కేటీఆర్.
ఇలాంటి పరిస్థితే కాంగ్రెస్ పార్టీలో ఓ నాయకుడికి ఎదురయ్యింది. వనపర్తి కాంగ్రెస్ టికెట్ కోసం చిన్నారెడ్డి, మెఘారెడ్డి పోటీపడ్డారు. అయితే మొదట కాంగ్రెస్ పార్టీ టికెట్ చిన్నారెడ్డికి దక్కింది. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లోనే ఆయన పేరు ప్రకటించింది కాంగ్రెస్. దీంతో నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన చిన్నారెడ్డి ఎన్నికల కోసం అన్నిఏర్పాట్లు చేసుకున్నాడు. నామినేషన్ వేయడానికి సిద్దమవుతున్న సమయంలో ఆయన కాంగ్రెస్ అదిష్టానం షాకిచ్చింది.
సోమవారం రాత్రి వెలువడిన మూడో జాబితాలో మరోసారి వనపర్తి పేరు కనిపించింది. ఈసారి చిన్నారెడ్డి కాకుండా మేఘారెడ్డి పేరు వుంది. అంటే చిన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకుని మేఘారెడ్డికి కాంగ్రెస్ టికెట్ కేటాయించిందన్నమాట. ఇలా తనకు టికెట్ ఇచ్చినట్లు ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో చిన్నారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.