తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేఏ పాల్ తమ్ముడు అని పేర్కొంటూ విమర్శలు చేశారు. తమ్ముడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేయడం లేదని అన్నారు.
Revanth Reddy: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని తమ్ముడు అంటూ సంబోధించారు. తమ్ముడు రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై దర్యాప్తు చేయడం లేదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని అన్నారు. ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు రెండ ులక్షల కోట్ల అప్పు అయిందని తెలిపారు.
2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించారని కేఏ పాల్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అవినీతిమయం అని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై ఇన్వెస్టిగేషణ్ చేస్తామని తమ్ముడు రేవంత్ రెడ్డి గతంలో పేర్కొన్నారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎంక్వైరీ కోసం ఆయన సీబీఐకి లేఖ రాయలేదని అన్నారు.
ఇదే సందర్భంలో కేఏ పాల్ ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారాన్ని ప్రస్తావించారు. మెఘా కృష్ణారెడ్డి కూడా ఈ పార్టీలు అన్నింటికీ ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు అందించారని చెప్పారు. అందుకే ఈ పార్టీలు అన్నీ ఒకటే అని చెబుతున్నట్లు పేర్కొన్నారు.