హైదరాబాద్: పెళ్లింటికి బ్యాంక్ రికవరీ సిబ్బంది... అవమానంతో పెళ్లికొడుకు ఆత్మహత్య

By Arun Kumar P  |  First Published Dec 6, 2021, 11:12 AM IST

మరికొద్దిరోజుల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఇంట చావుబాజా మోగింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు అప్పిచ్చిన బ్యాంకు నుండి ఒత్తిడి ఎక్కువవడంతో పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుుకుంది. 


రాజేంద్రనగర్‌: మరికొన్ని రోజుల్లోనే వివాహం. పెళ్లి కార్డుల పంపిణీ కూడా ప్రారంభమయ్యింది. ఇలా పెళ్ళిసందడితో ఆనందం వెల్లివిరిసిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. తీసుకున్న లోన్ కట్టాలంటూ బ్యాంక్ సిబ్బంది ఇంటికి రావడంతో అవమానంగా భావించిన పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.  

బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. hyderabad శివారులోని రాజేంద్రనగర్ శివరాంపల్లి పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో అవినాష్ వాగ్దే(25) కుటుంబంతో కలిసి నివాసముండేవాడు. అతడికి వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించి ఓ అమ్మాయిని ఖాయం చేసి పెళ్లికి కూడా ముహూర్తం ఖరారుచేసారు. ఈ నెల 26వ తేదీన పెళ్లి జరగాల్సి వుండగా ఇప్పటికే వెడ్డింగ్ కార్డుల పంపిణీ ప్రారంభించారు.  

Latest Videos

undefined

అయితే గతంలో అవినాష్ రెండు బ్యాంకుల నుండి కొంత రుణం తీసుకున్నాడు. ఈఎంఐ పద్దతిలో ఆ రుణాన్ని తిరిగి చెల్లించేవాడు. అయితే ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో EMI చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంకు ఏజెంట్లు ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని సూచించారు. అయినా ఫలితం లేకపోవడంతో నేరుగా అవినాష్ ఇంటికే వచ్చి పెండింగ్ ఈఎంఐలు చెల్లించాలని గట్టిగా చెప్పారు.

read more  హైదరాబాద్: అర్ధరాత్రి కారు బీభత్సం... ఇద్దరి ప్రాణాలు బలి

ఇలా పెళ్లింటికి రావడమే కాదు కుటుంబసభ్యుల ముందే బ్యాంక్ సిబ్బంది డబ్బులు కట్టాలని నిలదీయడాన్ని అవినాష్ అవమానకరంగా భావించాడు. దీంతో క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాల్సిన వాడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని అవినాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. 

కుటుంబసభ్యులు చాలాసేపటి తర్వాత అవినాష్ ఉరేసుకున్నట్లు గుర్తించారు. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అవినాష్ సోదరుడు సంతోష్‌ వాగ్దే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనాస్థలికి చేరుకుని అవినాష్ మృతదేహాన్ని కిందకుదించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అవినాష్‌ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోదరుడి మృతికి బ్యాంక్‌ నిర్వాహకులే కారణమని సంతోష్‌ వాగ్దే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.  

READ MORE  జాకెట్ కోసం భర్తతో గొడవపడి.. మహిళ ఆత్మహత్య...

ఇదిలావుంటే పెళ్లయిన కొద్ది గంటలకే జీవితంపై విరక్తిచెందాడో ఏమోగానీ ఓ నవవరుడు కోటగోడ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. బిల్వా గ్రామానికి చెందిన 32 యేళ్ల Dinesh Kumawat కు విరాట్ నగర్ కు చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లి తరువాత భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్లాడు దినేష్.  

అత్తవారింటికి వచ్చిన కొద్ది గంటలకే దినేష్ కి ఏమనిపించిందో తెలియదు.. ప్రశాంతత కోసం కొద్దిసేపు గుడికి వెళ్లొస్తానని ఇంట్లో కుటుంబసభ్యులకు చెప్పి బైటికి బయలుదేరాడు. అయితే అల్లుడు ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవడంతో అత్తింటివారు ఫోన్ చేసారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పడంతో వారు షాక్ కు గురయ్యారు. అయితే ఆత్మహత్య కోసం కోటగోడ ఎక్కిన దినేష్ ను మామ, బావమరిది నచ్చజెప్పి కిందకు దింపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)

 

click me!