
వరంగల్ అర్బన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అయితే,
ఉపన్యాసం ఇస్తూ అస్వస్థతకు గురై కుప్పకూలిన ఆయన వేదిక మీదే కుప్పకులినట్లు సమాచారం అందింది.
ఉప ముఖ్యమంత్రిని అధికారులు అసుపత్రికి తరలించే ప్రయత్నం జరిగింది.
అయితే, అందుబాటులో డాక్టర్లు వుండటంతో పక్కనే ఉన్న కారులో చికిత్స నిర్వహించారు.
వివరాలు అందాల్సి ఉంది.
ఇపుడే అందిన సమాచారం:
ఎండ వల్ల ఇలా సిక్ అయ్యారని కాకతీయ అర్బన్ డెవెలప్ మెంట్ అధారిటీ ఛెయిర్మన్ యాదవరెడ్డి ఎషియానెట్ కు ఉదయం పదిపదికి తెలిపారు.
ప్రమాదమేమీ లేదని, కొద్దిసేపట్లోనే ఆయన కోలుకున్నారని కూడా ఆయన చెప్పారు.
కోద్ది సేపటి తర్వాత తెరుకోని పోలీసుల గౌరవ వందనం స్వీకరించి తన ప్రసంగం కోనసాగించారని రెడ్డి చెప్పారు.