ప్రాణంగా ప్రేమించాడు... కానీ, చెల్లి అవుతుందని తెలిసి మనస్తాపంతో....

By AN Telugu  |  First Published Sep 27, 2021, 10:51 AM IST

ఆ పరిచయం కాస్త రోజులు గడిచిన కొద్దీ ప్రేమగా మారింది. కాగా కొద్ది కాలానికి తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ విషయం తెలిపాడు వంశీ. అయితే తాను అతనికి వరుసకు చెల్లి అవుతానని చెప్పి ఆ ప్రేమను నిరాకరించింది ఆ యువతి. 


మహబూబాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రాణంగా ప్రేమించిన యువతి వరుసకు చెల్లి (Sister) అవుతుందని తెలియడంతో యువకుడు పురుగుల మందు (Poison) తాగి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ సంఘట ఆదివారం మహబూబాబాద్ జిల్లా(Mahabubabad) బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాలో ఆదివారం చోటు చేసుకుంది. 

బతుకు మీద ఆశలు కల్పించాల్సిన ప్రేమ ప్రాణాలు తీస్తోంది. వరుసలు తెలియకుండా ప్రేమలో పడి అభం, శుభం తెలియని ఉసురు తీసుకుంటోంది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చెల్లి వరసో, అన్న వరసో అవుతాడని తెలియడంలో ఆ హృదయాలు ముక్కలవుతున్నాయి. ఆ విషాదాన్ని మోయలేక, ప్రేమించిన వ్యక్తుల్ని వదులుకోలేక ఏకంగా లోకాన్నే విడిచిపెడుతున్నారు. 

Latest Videos

సంతులాల్ పోడు తండాకు చెందిన బానోతు వంశీ(19) మహబూబాబాద్ లో ఇంటర్ చదువుతున్నాడు. దీనికోసం నిత్యం బస్సులో తన ఊరు నుంచి మహబూబాబాద్ కు వెళ్లి వస్తుండే వాడు. ఈ క్రమంలో గంధంపల్లి-కొత్తపేటకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. 

ఆ పరిచయం కాస్త రోజులు గడిచిన కొద్దీ ప్రేమగా మారింది. కాగా కొద్ది కాలానికి తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమ విషయం తెలిపాడు వంశీ. అయితే తాను అతనికి వరుసకు చెల్లి అవుతానని చెప్పి ఆ ప్రేమను నిరాకరించింది ఆ యువతి. 

దీంతో వంశీ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ విషయం నుంచి తేరుకోలేకపోయాడు. ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడ. మృతుడి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు. 

Cyclone Gulab: హైదరాబాదులో భారీ వర్షం జిహెచ్ఎంసీ హై అలర్ట్

కాగా, సూర్యపేటలోనూ ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడ్డారు. కానీ.. వారిద్దరి కులాలు వేరు కావడంతో వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని అనుకన్నవారి ఆశలు అడియాశలయ్యాయి. పెళ్లితో ఒక్కటి కాకపోయినా.. కనీసం చావుతో ఒకటి అవుదామని నిర్ణయించుకొని వారు ఏకంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట పురపాలిక పరిధిలోని సుందరయ్యనగర్ కు చెందిన నాగమణి(24), దుబ్బతండాకు చెందిన ధరవత్ నెహ్రూ(28) కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. నెహ్రూ స్థానికంగా సుతారి మేస్త్రీగా పనిచేస్తుండగా... నాగమణి ఇటీవల నర్సింగ్ విద్య పూర్తి చేసుకొని హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరారు,

ఈ నేపథ్యంలో వారు తమ ప్రేమ విషయాన్ని ఇటీవల ఇరు కుటుంబాల ముందు ఉంచారు.  అయితే.. కులాలు వేరు అనే కారణంగా నాగమణి తల్లిదండ్రులు వారి ప్రేమను నిరాకరించారు. మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ధరవాత్ నెహ్రూ.. తన నివాసంలో ఉరివేసుకొని చనిపోయాడు.

నెహ్రూ మరణ వార్త తెలుసుకున్న ప్రేయసి నాగమణి కూడా.. అతని మరణ వార్త తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది, ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

click me!