హైదరాబాద్‌ సూరారంలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి బాలుడి మృతి

హైదరాబాద్‌ సూరారంలో విషాదం చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి పడి బాలుడు మృతిచెందాడు.

Google News Follow Us

హైదరాబాద్‌ సూరారంలో విషాదం చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి పడి బాలుడు మృతిచెందాడు. వివరాలు.. సూరారంలోని రాజీవ్‌గృహకల్పలో తులసీదాస్ అనే బాలుడి కుటుంబం నివాసం ఉంటుంది.  అయితే గురువారం బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి పడిపోయాడు. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆస్పత్రికి తరలించేలోపు బాలుడు మృతిచెందాడు. సైడ్ వాల్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాలుడి తండ్రి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. తన కొడుకు ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి మృతిచెందినట్టుగా బాలుడి తండ్రి పోలీసులకు తెలిపాడు. 

ఇక, బాలుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టమ్ అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా కూడా తీవ్ర  విషాదం నెలకొంది. 

Read more Articles on