దొంగిలించాడని ఓ బాలుడి దుస్తులు విప్పి ప్రైవేట్ పార్ట్స్ పై కారం చల్లిన దుకాణదారుడు.. హైదరాబాద్‌లో ఘటన

By Mahesh KFirst Published Dec 20, 2022, 4:32 PM IST
Highlights

హైదరాబాద్‌లో చోరీ చేశాడని ఓ దుకాణదారుడు పదేళ్ల బాలుడిని కొట్టాడు. బట్టలు తొలగించి బాలుడి ప్రైవేటు పార్టులపై కారం పొడి చల్లాడు. బాలుడి తల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దుకాణదారుడు క్రిష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అవాంఛనీయ ఘటన జరిగింది. పొరుగునే ఉండే దుకాణంలో నుంచి ఓ కూల్ డ్రింక్ బాటిల్ దొంగిలించాడని దుకాణదారుడు పైశాచికానికి పాల్పడ్డాడు. బాలుడిని బంధించి చితకబాదాడు. బట్టలు విప్పి అతడి ప్రైవేటు పార్టులపై కారం పొడి చల్లాడు. ఎండలో నిలబెట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను మొత్తం ఆ దుకాణాదారుడు తీసి తన మిత్రులతో పంచుకున్నట్టు తెలిసింది. దుకాణదారుడిని కృష్ణగా గుర్తించారు. బాలుడి తండ్రి అతడి వీడియో తీస్తూ ఆరా తీశాడు. బాలుడు రోధిస్తూ తన బాధను చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సోమవారం సాయంత్రం బాలుడి తల్లి పోలీసు స్టేషన్ వెళ్లింది. తన కుమారుడిని పొరుగునే ఉండే దుకాణదారుడు వారి ఇంటి టెర్రస్ పైకి తీసుకెళ్లాడని, అక్కడే బట్టలు విడిచి కొట్టాడని, కారం పొడి చల్లాడని ఆరోపించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆ బాలుడు నగ్నంగా నైలాన్ తాడుతో కాళ్లు, చేతులు కట్టివేసిన స్థితిలో కనిపించాడు. బాధతో ఏడుస్తున్నాడు. కారం పొడితో మండిపోతూ ఇబ్బంది పడుతున్నట్టుగా బాలుడు ఉన్నాడు. అతని కళ్లు కూడా ఇబ్బంది పెడుతున్నట్టుగా కనిపించింది. అతను చేసిన కొన్ని పనులను బాలుడు ఒప్పుకుంటున్నట్టు మాట్లాడాడు. తనను విడిచిపెట్టాలని వేడుకుంటున్నాడు.

Also Read: గ్రామాల్లోనూ రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు... నడిరోడ్డుపై మహిళ మెడలోంచి బంగారం చోరీ

కాగా, బాలుడి అంకుల్ ఈ ఘటనపై సీరియస్ అవుతూ షాప్ ఓనర్ పై మండిపడ్డాడు. తమ బాలుడు షాపు నుంచి దొంగిలించినట్టు తమకు ఎందుకు సీసీటీవీ ఫుటేజీ చూపించడం లేదని నిలదీశాడు. అతడు తమ బాలుడిని ఇంటికి తీసుకెళ్లి ఇలా దాడి చేయడాన్ని ఎవరు అంగీకరిస్తారు? అని ప్రశ్నించాడు. తన కొడుకు చోరీ చేసి ఉండడని, కేవలం వాటిని ముట్టుకుని లేదా పక్కకు జరిపి ఉండొచ్చని తల్లి పేర్కొంది. తన కొడుకు తప్పుగా చిత్రిస్తున్నారని వివరించింది.

కాగా, ఆ బాలుడు తరుచూ తమ దుకాణం నుంచి చోరీ చేస్తున్నాడని, అందుకే అతడిని భయపెట్టి మరోసారి దొంగతనం చేయకుండా చేయాలని భావించినట్టు దుకాణదారుడు పోలీసులకు చెప్పినట్టు పోలీసు అధికారి సైద బాబు ఎన్డీటీవీకి తెలిపారు.

బాలుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు షాప్ ఓనర్ పై కేసు నమోదు చేశారు. ఆ దుకాణం యజమాని కృష్ణను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

click me!