ఢిల్లీ లిక్కర్ స్కాం: బోయినపల్లి అభిషేక్ రావు కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు

By narsimha lode  |  First Published Oct 13, 2022, 4:09 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ రావు కస్టడీని మరో రెండు రోజుల పాటు పొడిగించింది కోర్టు. ఇవాళ్టితో అభిషేక్ రావు కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారుల అభ్యర్ధన మేరకు కోర్టు  ఈ నిర్ణయం తీసుకుంది. 


న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బోయినపల్లి అభిషేక్ రావు కస్టడీని మరో రెండు రోజులు పొడిగించింది కోర్టు. ఈ మేరకు గురువారం నాడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన బోయినపల్లి అభిషేక్ రావును ఢిల్లీలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కాంలో  విచారణపేరుతో అభిషేక్ రావును ఢిల్లీకి పిలిపించి అక్కడే ఆయనను అరెస్ట్ చేశారు.ఈ నెల 11 వ తేదీ నుండి సీబీఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు.  ఇవాళ్టితో ఆయన కస్టడీ ముగిసింది. అయితే కస్టడీని పొడిగించాలని సీబీఐ కోర్టును కోరారు. దీంతో కోర్టు అనుమతించింది. మరో రెండు రోజుల పాటు అభిషేక్  రావును సీబీఐ అధికారులు విచారించనున్నారు.

అభిషేక్ రావును ఐదు రోజులకస్టడీకి ఇవ్వాలని సీబీఐ  కోర్టును  అధికారులు కోరారు. అయితే మూడు రోజుల  కస్టడీకి కోర్టు అనుమతిని ఇచ్చింది.ఇవాళ్టితో కస్టడీ ముగిసింది.దీంతో మరోసారి మరో రెండు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్నకోర్టు  అభిషేక్ రావు కస్టడీకి అనుమతిని ఇచ్చింది.  అభిషేక్ రావును విచారిణ పేరుతో సమయం వృధా చేస్తున్నారని సీబీఐ అధికారులపై  అభిషేక్ రావు తరపు న్యాయవాదులు ఆరోపించారు.  మరో రెండు రోజుల పాటు కస్టడీ అవసరం లేదని వాదించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి లోతుగా దర్యాప్తు చేసేందుకు అభిషేక్ రావును ఇంకా రెండు  రోజుల పాటు విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. 

Latest Videos

హైద్రాబాద్ కు చెందిన   అరుణ్ రామచంద్ర  పిళ్లై పేరును ఈ కేసులో సీబీఐ చేర్చింది. హైద్రాబాద్ లో నాలుగు దఫాలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఎల్ఎల్ సీ డైరెక్టర్ గా  బోయినపల్లి అభిషేక్ రావు వ్యవహరిస్తున్నారు. అభిషేక్ రావు ఖాతాల్లోకి నగదు వచ్చిన విషయాన్ని సీబీఐ అధికారులు గుర్తించారు.  రూ. 3.85 కోట్లు అభిషేక్ రావు ఖాతాల్లోకి ఎలా వచ్చాయనే విసయమై సీబీఐ అధికారులు విచారించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయినపల్లి అభిషేక్ రావుది  కీలక పాత్రగా సీబీఐ  పేర్కొంది.ఈ మేరకు సీబీఐ అభిషేక్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించింది. 

also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: అభిషేక్‌ రావు కస్టడీ రిపోర్ట్‌లో కీలక విషయాలు.. రూ. 3.80 కోట్ల లావాదేవీలపై సీబీఐ ఫోకస్

విజయ్ నాయర్  ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా  అభిషేక్ రావు ను  అరెస్ట్ చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపినట్టుగా ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, దినేశ్ అరోరాలతో కలిసి  అభిషేక్ రావు ఈ కుట్ర చేసినట్లు సీబీఐ అధికారులు  నిర్ధారించారని  ఈ  కథనం తెలిపింది. అభిషేక్ రావుకు చెందిన  3 అకౌంట్ల ద్వారా  డబ్బులు పంపినట్లుగా సీబీఐ తేల్చింది. అయితే ఎవరెవరు డబ్బులు పంపారో అభిషేక్ చెప్పడం లేదని సీబీఐ పేర్కొందని ఆ కథనంలో వివరించింది.

click me!