ఎదవలు.. కార్యకర్తల్ని బలి చేశారు, వాళ్ల వెనుక మనవాళ్లే : పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రేణుక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Oct 13, 2022, 03:55 PM IST
ఎదవలు.. కార్యకర్తల్ని బలి చేశారు, వాళ్ల వెనుక మనవాళ్లే : పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రేణుక వ్యాఖ్యలు

సారాంశం

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ , మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఏం చేశారని రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.   

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ , మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో గెలిచి పార్టీ మారారని మండిపడ్డారు. కార్యకర్తల శ్రమ మీద గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఏం చేశారని రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా చేద్దామని చెప్పానని.. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల వెనుక మనవాళ్లే వున్నారని ఆమె వాపోయారు. ఎమ్మెల్యేలు ఎదవలై కాంగ్రెస్‌లో గెలిచి పార్టీలు మారారంటూ రేణుకా చౌదరి మండిపడ్డారు. మన కార్యకర్తలను బలి చేసిన వాళ్లతో కొందరు నేతలు రహస్య బంధాలు ఏర్పరచుకున్నారని ఆమె ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

Bullet Train India: దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్, అమరావతి రూట్లలో గంటలో ప్రయాణం
MLC Kavitha: బబుల్ షూటర్ వల్లే కేసిఆర్ కి ట్రబుల్ హరీశ్ రావుపై కవిత సెటైర్లు | Asianet News Telugu