కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకంటా: కేటీఆర్

By narsimha lode  |  First Published Oct 13, 2022, 3:39 PM IST

మునుగోడులో  డబ్బులతో ఓట్లను కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.  మోడీ సర్కార్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తులను పెంచిపోషించిందన్నారు. 
 


 మునుగోడు:మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే  ఈ నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకొంటామనని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 

మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా చండూరులో గురువారం నాడు నిర్వహించిన  సభలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. 

Latest Videos

ప్రతి మూడు నెలలకు ఓసారి మునుగోడులో ప్రతి అభివృద్ది కార్యక్రమాన్ని తానే స్వయంగా పరిశీలించనున్నట్టుగా కేటీఆర్ తెలిపారు. సూర్యాపేటను మంత్రి జగదీష్ రెడ్డి, సిరిసిల్లను తాను ఎలా చూసుకొంటున్నామో మునుగోడును కూడా తామిద్దరం కలిసి  అభివృద్దిలో ముందుకు నడిపిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామన్నారు. 

మునుగోడు ఆత్మగౌరవానికి, డబ్బు మదం ఉన్న కాంట్రాక్టర్ కు మధ్యేపోటీగా ఉప ఎన్నికను ఆయన పోల్చారు. ఒక్కో ఓటును డబ్బు పెట్టి కొంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నాడన్నారు.  మునుగోడు ఉప ఎన్నిక ప్రజలపై బలవంతంగా రాజగోపాల్ రెడ్డి  రుద్దారని ఆయన ఆరోపించారు. 

మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. దేవుళ్లను కూడా తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆయన చెప్పారు.పాకిస్తాన్, హిందూస్తాన్ తప్ప పనికొచ్చే ముచ్చట్లు మోడీ చెప్పరన్నారు.  తిరుమలకు ధీటుగా యాదాద్రి ఆలయాన్ని అభివృద్ది చేసినట్టుగా  కేటీఆర్ గుర్తు చేశారు  యాదాద్రి ఆలయానికి మోడీ సర్కార్ ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ కంటే మోడీ పెద్ద హిందువా అని ఆయన ప్రశ్నించారు. 

ఎన్నికల ముందు విదేశీ బ్యాంకుల్లోని నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని ఇచ్చిన  హామీ ఏమైందని ఆయన మోడీని ప్రశ్నించారు. మోడీ రూ. 15 లక్షలు ఇస్తే బీజేపీకి ఓటేయాలన్నారు. లేకపోతే తమ పార్టీకి ఓటేయాలని కేటీఆర్ కోరారు. 

ధనవంతులకు  దేశసంపదను ప్రధాని నరేంద్ర మోడీ దోచిపెడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. ఇందులో భాగంగానే మోడీ ప్రభుత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తులను పెంచారన్నారు. రూ.18 వేల కోట్లతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆయన అన్నను  బీజేపీ కొనుగోలు చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజగోపాల్ రెడ్డికి చెందిన చిన్న కంపెనీకి రూ. 18 వేల కోట్ల పెద్ద కాంట్రాక్టు ఎలా వచ్చిందో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

 కాంట్రాక్టు డబ్బులతో మునుగోడు ప్రజలను అంగట్లో సరుకులుగా కొనుగోలు  చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ బీజేపీపై విమర్శలు చేశారు. నాలుగేళ్లలో  ఒక్కసారి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు రాలేదన్నారు. ఒక్క అభివృద్ది పనిని కూడ రాజగోపాల్ రెడ్డి చేయలేదని ఆయన చెప్పారు.

also read:అక్రమ పద్దతులతో విజయం కోసం టీఆర్ఎస్ యత్నం: ఈసీకి బీజేపీ ఫిర్యాదు

మునుగోడులో మంచినీటికి ఎంత కష్టముందడేదో కేసీఆర్ కు తెలుసునని కేటీఆర్ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మంచినీటి  గోస తీరుస్తానన్న మాట నిలబెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.పేదోళ్లను గొప్పోళ్లుగా చేసేందుకు కేసీఆర్ అనేక పథకాలు తీసుకువచ్చారని కేటీఆర్ చెప్పారు. పెన్షన్ ను రూ. 200ల నుండి రూ. 2016కు తమ ప్రభుత్వం పెంచిందన్నారు. 

click me!