రాజేంద్రనగర్ లో భారీ చోరీ.. 26తులాల బంగారం అపహరణ

Published : Apr 09, 2019, 10:52 AM IST
రాజేంద్రనగర్ లో భారీ చోరీ.. 26తులాల బంగారం అపహరణ

సారాంశం

హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అత్తాపూర్ లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూలేని సమయాన్ని ఆసరాగా చేసుకొని దొంగలు చోరీకి పాల్పడ్డారు.

హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి అత్తాపూర్ లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూలేని సమయాన్ని ఆసరాగా చేసుకొని దొంగలు చోరీకి పాల్పడ్డారు.

ఎన్నికళవేళ అందరూ ఎవరిపనుల్లో వాళ్లు బిజీగా ఉండటాన్ని దొంగలు అవకాశంగా తీసుకున్నారు. విశ్రాంత ఉద్యోగి సత్యనారాయణ ఇంట్లోకి దొంగలు చొరపడ్డారు. ఎండాకాలం కావడంతో ఇంటి డాబా పైన సత్యనారాయణ దంపతులు నిద్రిస్తున్నారు. ఇదే అదునుగా భావించి ఇంటి తాళాలు పగులకొట్టి దొంగలు చోరీ చేశారు.
 
ఇంట్లోని 26 తులాల బంగారు ఆభరణాలు, 70 తులాల వెండి, 75 వేల రూపాయల నగదు దుండగులు ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోతున్నాడు. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.  బంగారం విలువ రూ.12లక్షల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Gallantry Award : సాధారణ తెలుగు కానిస్టేబుల్ కి శౌర్య పతకం.. ఎవరీ మర్రి వెంకట్ రెడ్డి..? ఏ సాహసం చేశాడు..?
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి... ఈ తెలుగు జిల్లాల్లో రిపబ్లిక్ డే కూడా వర్షాలే