మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతోనే బరిలోకి.. అప్పటివరకు అదే పేరు: క్లారిటీ ఇచ్చిన వినోద్ కుమార్..!

By Sumanth KanukulaFirst Published Oct 6, 2022, 1:14 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును  భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆ పార్టీ బుధవారం రోజున తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ పేరు మార్పుపై, మునుగోడు ఉప ఎన్నికలో కొత్త పేరుతో పోటీ చేస్తారనే ప్రచారంపై టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టత ఇచ్చారు. 

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును  భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఆ పార్టీ బుధవారం రోజున తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ సర్వ సభ్యసమావేశంలో టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ జాతీయ పార్టీగా మార్చే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే పార్టీ పేరు మార్పుపై, మునుగోడు ఉప ఎన్నికలో కొత్త పేరుతో పోటీ చేస్తారనే ప్రచారంపై టీఆర్ఎస్ సీనియర్ నేత, ష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టత ఇచ్చారు. 

టీఆర్ఎస్ నేతలు వినోద్‌ కుమార్‌, శ్రీనివాస్‌ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుతూ చేసిన పార్టీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానం కాపీని ఎన్నికల సంఘం అధికారులకు అందజేశారు. పార్టీ పేరు మార్పును గుర్తించాలని కోరారు. 

Also Read: మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలోనే బాణసంచా నిర్వహకుడిపై దాడి

అనంతరం ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడిన వినోద్ కుమార్.. టీఆర్ఎస్ పేరును మాత్రమే బీఆర్ఎస్‌గా మార్చామని చెప్పారు. పేరు మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించేవరకు టీఆర్ఎస్‌గానే పార్టీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక తొందర్లోనే ఉన్నందున.. టీఆర్ఎస్ పేరుతోనే ముందుకు వెళ్తామని చెప్పారు. 

మునుగోడు బరిలో బీఆర్ఎస్ తరఫునే సీఎం కేసీఆర్ వారి పార్టీ అభ్యర్థిని నిలపనున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా వినోద్ కుమార్ కామెంట్స్‌తో మునుగోడు బరిలో టీఆర్ఎస్ పేరుతోనే కేసీఆర్ అభ్యర్థిని నిలపనున్నారని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ బుధవారం ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్.. ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా మారనుంది. ఇక, తెలంగాణ భవన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పేరు మార్పు, ఎజెండాను కేసీఆర్.. పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, వీసీకే చీఫ్ తిరుమలవలన్ కూడా పాల్గొన్నారు. పార్టీ పేరును మారుస్తూ కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత వారు శుభాకాంక్షలు చెప్పారు. 

click me!