బొడిగె శోభను కరుణించని బీజేపీ... పార్టీ మారినా దక్కని టికెట్

By sivanagaprasad kodatiFirst Published Nov 17, 2018, 7:57 AM IST
Highlights

కరీంనగర్ జిల్లా చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు బీజేపీలోనూ నిరాశ తప్పలేదు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఈమెకు అసెంబ్లీ రద్దు తర్వాత కేసీఆర్ ప్రకటించిన 105 మంది జాబితాలో చోటు దక్కలేదు. 

కరీంనగర్ జిల్లా చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు బీజేపీలోనూ నిరాశ తప్పలేదు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఈమెకు అసెంబ్లీ రద్దు తర్వాత కేసీఆర్ ప్రకటించిన 105 మంది జాబితాలో చోటు దక్కలేదు. తర్వాతి లిస్ట్‌లోనైనా పేరు ఉంటుందని శోభ ఆశపడ్డారు..

కానీ కేసీఆర్ చొప్పదండి టికెట్‌ను శోభకు కాకుండా సొంకె రవిశంకర్‌కు కేటాయించడంతో.. ఆమె టీఆర్ఎస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి పార్టీకి ఎంతో సేవ చేసిన తనకు అన్యాయం చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ తోడల్లుడు రవీందర్ రావు, ఎంపీ సంతోష్ కారణంగానే తనకు టికెట్ రాలేదని ఆరోపిస్తూ గురువారం బీజేపీలో చేరారు. ఇక్కడ కచ్చితంగా టికెట్ వస్తుందని భావించారు.. అయితే కమలంలోనూ ఈమెకు మొండిచేయి ఎదురైంది.

 శుక్రవారం రాత్రి బీజేపీ విడుదల చేసిన నాలుగో జాబితాలో శోభకు టికెట్ దక్కలేదు. ఇక ఈ జాబితాలో ఎ.శ్రీనివాసులు (చెన్నూరు), జంగం గోపి (జహీరాబాద్), ఆకుల విజయ (గజ్వేల్), శ్రీధర్ రెడ్డి (జూబ్లీహిల్స్), భవర్‌లాల్ వర్మ (సనత్ నగర్), సోమయ్య గౌడ్ (పాలకుర్తి), ఎడ్ల అశోక్ రెడ్డి  (నర్సంపేట) ఉన్నారు. దీంతో శోభ ఏం చేయబోతున్నారా అని చొప్పదండి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

కేసీఆర్ నన్ను మెడపట్టి గెంటేశారు.. బొడిగె శోభ

కేసీఆర్ టికెట్ ఇవ్వనందుకు అలక.. బీజేపీలోకి బొడిగె శోభ..?

వదిలిపెట్టను: కేసీఆర్ పై బొడిగె శోభ తిరుగుబాటు

పార్టీ మార్పుపై తేల్చేసిన బొడిగె శోభ

click me!