నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో ని కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడుతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఒకరు మరణించినల్టుగాసమాచారం.
నల్గొండ: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం నాడు రియాక్టర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఈ ఘటనలో ఒకరు మరణించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ఇవాళ సాయంత్రం ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు చోటు చేసుకోవడంతో ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు గాయపడ్డారని ఆ కథనం తెలిపింది. రియాక్టర్ పేలుడుతో మంటలు చెలరేగాయి. వెంటనే ఫైరింజన్లకు సమాచారం అందించారు ఫ్యాక్టరీ సిబ్బంది.దీంతో ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
undefined
రియాక్టర్ పేలిన సమయంలో 14 మంది కార్మికులు రియాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. అయితే రియాక్టర్ పేలుడు ధాటికి ఒకరు చనిపోయారు అంతేకాదు పలువురు గాయపడ్డారని ఆ కథనం తెలిపింది. రియాక్టర్ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భారీగా పొగ ఈ ప్రాంతంలో కన్పించింది. ఈ పొగతో కళ్లలో మంటలు వచ్చాయని స్థానికలు చెబుతున్నారని ఈ కథనం తెలిపింది.