అమ్మాయిల ఫోటోలతో రాజకీయ నాయకులకు ఎర... ముగ్గురు నిందితులు అరెస్ట్

By Arun Kumar PFirst Published Jul 4, 2021, 10:11 AM IST
Highlights

యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ నాయకుల పిర్యాదులతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్: రాజకీయ నాయకులను బెదిరించి, అందమైన అమ్మాయిలను ఎరవేసి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఇద్దరు రాజకీయ నాయకులను భాయ్ పేరిట ఫోన్లు చేసి బెదిరించి కోట్లు డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల పిర్యాదుతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకి వెళితే... యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మార్టూరు గ్రామానికి చెందిన క్రాంతికుమార్(23) ఉప్పల్ లో నివాసముంటూ యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నాడు. ఇతడి తమ్ముడు సింహాద్రి(19), స్నేహితుడు జశ్వంత్(20) కూడా డిగ్రీ చదువుతూ ఉప్పల్ లోనే వుంటున్నారు. యాడ్ ఏజెన్సీ పనుల్లో భాగంగా రాజకీయ నాయకులతో క్రాంతికుమార్ కు పరిచయాలున్నాయి. ఈ పరిచయాలను ఆసరాగా చేసుకుని ఈజీ మనీ సంపాదించాలని భావించిన క్రాంతికిరణ్ ఇందులో సోదరుడు, అతడి స్నేహితున్ని భాగస్వామ్యం చేశారు. 

తమ ప్లాన్ లో భాగంగా తార్నాక ప్రాంతంలో పండ్లు విక్రయించే యూపీకి చెందిన వ్యాపారి వద్ద సెల్ ఫోన్ దొంగిలించారు. ఈ ఫోన్ నుండి భువనగిరి ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ నాయకుడు ఐలయ్యకు కాల్ చేశారు. తాము గ్యాంగ్‌స్టర్‌ ఖలీల్‌ భాయ్ మనుషులమని...తమకు వెంటనే రూ. 5 కోట్లు ఇవ్వకుంటే హతమారుస్తామని బెదిరించారు. అయితే ఈ ఈ బెదిరింపులకు భయపడని ఐలయ్య భువనగిరి పోలీసులను ఆశ్రయించాడు.  

read more  పెళ్లయి ఏడేళ్లు: ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య, కుమారుడి ఏడ్పు విని...

ఐలయ్య నుండి డబ్బులు రాకపోవడంతో సిమ్ కార్డు మార్చి మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి గోరేటి శ్రీనివాస్ కు అమ్మాయి పేరుతో మెసేజ్ చేశారు. నిజంగానే అమ్మాయి చాట్ చేస్తుందని భావించిన శ్రీనివాస్ తిరిగి మెసేజ్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత సదరు మహిళ భర్త పేరిట శ్రీనివాస్ ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించి రూ.10లక్షలు డిమాండ్ చేశారు. దీంతో అతడు కూడా పోలీసులను ఆశ్రయించాడు. 

ఇద్దరిని బెదిరించి డబ్బులు లాగాలని చూసింది ఒకే ముఠా అని పోలీసులు గుర్తించారు. పలు కోణాల్లో విచారణ జరిపి నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు. క్రాంతికుమార్ గ్యాంగ్ నుండి ఒక హోండా యాక్టివా బైక్, 3 కత్తులు, చోరీ చేసిన ఫోన్‌ తో పాటు ముగ్గురు నిందితుల సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

click me!