పెళ్లయి ఏడేళ్లు: ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య, కుమారుడి ఏడ్పు విని...

Published : Jul 04, 2021, 08:10 AM IST
పెళ్లయి ఏడేళ్లు: ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య, కుమారుడి ఏడ్పు విని...

సారాంశం

పెళ్లయి ఏడేళ్లు గడిచినా ఓ మహిళ తన ప్రియుడిని మరవలేకపోయింది. ప్రియుడితో కలిసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలంలో వివాహిత కుమారుడి ఏడుపు విని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.

నాగర్ కర్నూలు: తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో విషాదకరమైన సంఘటన జరిగింది. ప్రియుడితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలంలో ఆమె కుమారుడి ఏడుపు విని అక్కడికి ఇరు కుటుంబాలు చేరుకునే సరికే వారు మరణించారు. ఈ సంఘటన జిల్లాలోని మద్దిమడుగులో శనివారం జరిగింది. 

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలానికి చెందిన యువకుడు (30), యువతి (28) ప్రేమించుకున్నారు. ఆ విషయం తెలియడంతో యువతికి తల్లిదండ్రులు ఏడేళ్ల క్రితం హైదరాబాదుకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కలిగారు. అయితే, తన ప్రియుడితో ఆమె మాట్లాడుతూనే వ్సోతంది. 

నాలుగేళ్ల కురమాడుతిో కలిసి ఆమె ప్రియుడితో కలిసి పది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండు కుటుంబాల వాళ్లు వారి కోసం గాలింపు ప్రారంభించారు. ఇద్దరు కూదడా నాగర్ కర్నూలు జిల్లాలోని పదర మండలం మద్దిమడుగుకు చేరుకున్నారు. గ్రామానికి అర కిలోమిటర్ దూరంలో గల ఆలయం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు 

ఆత్మహత్యకు ముందు వారు ఫోన్ చేసి తమ కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. దాంతో రెండు కుటుంబవాళ్లు మద్దిమడుగు వెళ్లి గాలింపు చేపట్టారు. ఆలయ సమీపంలోని చెట్ల మధ్య గాలిస్తుండగా వివాహిత కుమారుడి ఏడుపు వినిపించింది. ఆ ఏడుపును బట్టి వారు అక్కడికి చేరుకున్నారు. అయితే, అప్పటికే ఇద్దరు మరణించారు. 

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.  పోస్టుమార్టం కోసం పోలీసులు మృతదేహాలను ఆమ్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

KTR Comments on Revanth: ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి భారత్ దేశంలో ఎవ్వరుండరు| Asianet News Telugu
Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాటలకు తెలంగాణ గుండెలు రగిలిపోతున్నాయి | Asianet News Telugu