తెలంగాణ విమోచన దినోత్సవం తర్వాత బీజేపీ రాష్ట్రవ్యాప్త యాత్ర: జీ. కిషన్ రెడ్డి

By Mahesh Rajamoni  |  First Published Aug 31, 2023, 3:12 AM IST

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ మ‌రింత దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర‌వ్యాప్త యాత్ర‌ను చేప‌ట్ట‌నుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ జీ.కిష‌న్ రెడ్డి తెలిపారు. అలాగే, రాజాసింగ్ వ్యవహారంపై జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంద‌న్నారు. ఇక రాఖీ పండుగ సందర్భంగా కేంద్రం తీసుకున్న‌ ఎల్పీజీ ధరల తగ్గింపును బీజేపీ నాయ‌కులు స్వాగ‌తించారు.
 


Telangana BJP chief G Kishan Reddy: తెలంగాణ విమోచన దినోత్సవం తర్వాత రాష్ట్ర వ్యాప్త యాత్ర ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్ రెడ్డి చెప్పారు. యాత్రికులు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజలను కలుస్తార‌ని పేర్కొన్నారు. అలాగే, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంపై జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా కిషన్ రెడ్డి చెప్పారు. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశం అనంతరం పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. కుటుంబ ఆధారిత బీఆర్ఎస్ మాదిరిగా కాకుండా తమ పార్టీ క్యాడర్ బేస్డ్ అనీ, డైనింగ్ టేబుల్ వద్ద అభ్యర్థులను నిర్ణయిస్తుందని చెప్పారు. క్యాడర్ తో మాట్లాడిన తర్వాతే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

అంతకు ముందు మండల స్థాయిలో మోర్చా రాష్ట్ర కార్యవర్గ, ఓబీసీ మోర్చా అధ్యక్షులను ఉద్దేశించి బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రసంగించారు. రాఖీ పండుగ సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.200 తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని డాక్టర్ లక్ష్మణ్, కిషన్ స్వాగతించారు. ఇది మహిళలకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం ఇచ్చిన రాఖీ కానుక అని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రజలకు ఇది శుభవార్త అని కిషన్ రెడ్డి అన్నారు. ఎల్పీజీ ధరల తగ్గింపుతో దేశవ్యాప్తంగా 33 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

Latest Videos

అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. మరో 75 లక్షల ఉజ్వల రహిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. పీఎంయూవై లబ్ధిదారులకు సిలిండర్ కు రూ.400 సబ్సిడీ ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు పెట్రోల్ పై పన్నులను తగ్గించాయనీ, ధరను తగ్గించాయని, ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించాయని ఆయన అన్నారు. అయితే పన్నులు తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరాకరించింద‌నీ, ఇతర రాష్ట్రాలకు భిన్నంగా రాష్ట్ర ప్రజలు అధిక ధరలను చెల్లించి భారాన్ని మోస్తున్నార‌ని అన్నారు.

click me!