కేంద్రంలో మూడోసారి అధికారం బీజేపీదే: ఆదిలాబాద్ సభలో కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published Oct 10, 2023, 4:51 PM IST

వచ్చే ఏడాది పార్లమెంట్ కు జరిగే ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.



ఆదిలాబాద్:మూడో సారి కేంద్రంలో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటుందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మోడీ మూడోసారి  ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు

ఆదిలాబాద్ లో మంగళవారంనాడు  బీజేపీ నిర్వహించిన జనగర్జన సభలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రసంగించారు.  తెలంగాణ విమోచన ఉత్సవాలను మొదటిసారిగా  అమిత్ షా జరిపించారన్నారు.ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత  ఆదిలాబాద్ లో తొలి సభను నిర్వహించుకుంటున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.

Latest Videos

undefined

also read:తెలంగాణలో బీజేపీదే అధికారం: ఆదిలాబాద్ సభలో అమిత్ షా

ఆదిలాబాద్ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని బీజేపీ పూరించింది.  తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు విస్తృతంగా పర్యటించనున్నారు.  ఈ నెల  మొదటివారంలోనే  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించారు.ఈ నెల  1న మహబూబ్ నగర్ లో ఈ నెల 3న  నిజామాబాద్ లో నిర్వహించిన సభల్లో మోడీ పాల్గొన్నారు. నిజామాబాద్ లో జరిగిన సభలో  ప్రధాని నరేంద్ర మోడీ  కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత  ఎన్‌డీఏలో చేరుతానని  కేసీఆర్ తనను కోరిన విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నెల  6న జరిగిన బీజేపీ కౌన్సిల్ సమావేశంలో  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.

తెలంగాణపై  బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ పెంచింది. తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కోసం ఆపార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది.  సునీల్ భన్సల్ నేతృత్వంలోని టీమ్  కొంత కాలంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు  కార్యాచరణను సిద్దం చేస్తుంది.


 

click me!