తెలంగాణ ఎన్నికల బరిలో వైసీపీ.. వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..?

By Siva Kodati  |  First Published Oct 10, 2023, 4:18 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం వైసీపీకి లేదని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మద్యం, ఇసుక పాలసీలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు యాక్షన్‌లోకి దిగిపోయాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ ఈసారి తెలంగాణ ఎన్నికల బరిలో దిగనుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం వైసీపీకి లేదని ఆయన తేల్చిచెప్పారు.

కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపాదించిన విధంగా రెండు రాష్ట్రాలకు నీటి పంపకాలు జరిగాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని.. కానీ పురందేశ్వరి టీడీపీ మాదిరిగానే ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం, ఇసుక పాలసీలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

Latest Videos

ALso Read: తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా.. ఈ విషయాలు మీకు తెలుసా..?

వెలిగొండ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని.. జనవరి కల్లా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జనసేన, టీడీపీలే కాదు.. ఎన్ని పార్టీలు కలిసి పనిచేసినా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్ధుల మధ్య పోటీ ఎక్కువై నియోజకవర్గాలు సరిపోవడం లేదని ఆయన పేర్కొన్నారు. జనసేనకు అభ్యర్ధులున్నారా అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అవినీతి జరిగిందని.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలలో కోర్టుల ద్వారా విచారణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 
 

click me!