ప్రతి రంగంలోనూ తెలంగాణ ఎంతో పురోగతి సాధించింది: ఐటీ మంత్రి కేటీఆర్

By Mahesh Rajamoni  |  First Published Oct 10, 2023, 4:39 PM IST

Bhupalpally: తెలంగాణ‌ విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో ఆసరా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనీ, ఏ రాష్ట్రంలో ఇంత మొత్తంలో పింఛ‌న్లు ఇవ్వ‌డం లేదన్నారు. భూపాలపల్లి కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేసిందనీ, వెనుకబడిన భూపాలపల్లికి మెడికల్ కాలేజీ వచ్చిందని కేటీఆర్ తెలిపారు.
 


IT, MA&UD Minister K T Rama Rao: తెలంగాణ అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు (కేటీఆర్) అన్నారు. తెలంగాణ‌ విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో ఆసరా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అనీ, ఏ రాష్ట్రంలో ఇంత మొత్తంలో పింఛ‌న్లు ఇవ్వ‌డం లేదన్నారు. భూపాలపల్లి కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేసిందనీ, వెనుకబడిన భూపాలపల్లికి మెడికల్ కాలేజీ వచ్చిందని కేటీఆర్ తెలిపారు. భూపాలపల్లిలో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీవోసీ), జిల్లా పోలీసు కార్యాలయం, డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు.

2014 నుంచి తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తీవ్రమైన విద్యుత్ కొరత నుంచి నిరంతర విద్యుత్ సరఫరా, బీడు భూముల నుంచి సారవంతమైన భూముల వరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలో తెలంగాణ భారీ అభివృద్ధిని సాధించిందని కేటీఆర్ అన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి సీఎం కేసీఆర్ సమప్రాధాన్యమిచ్చారనీ, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ వెనుకబాటుతనాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు రూ.73 వేల కోట్లు పంపిణీ చేసిందన్నారు. విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో ఆసరా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. భూపాలపల్లి కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది. వెనుకబడిన భూపాలపల్లికి మెడికల్ కాలేజీ వచ్చిందని కేటీఆర్ తెలిపారు.

Latest Videos

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాగునీటి సౌకర్యంతో వ్యవసాయం ఊపందుకుందని అన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనతో పాటు ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ పుల్లా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పరకాలలో అభివృద్ధి పనుల్లో కేటీఆర్ పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయ భవనం, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. 114 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రగతి నివేదన సభలో మాట్లాడారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

click me!