కేసీఆర్ కు సెలవు చెప్పేందుకు ప్రజలు సిద్దం: నిజామాబాద్ లో కిషన్ రెడ్డి

By narsimha lode  |  First Published Oct 3, 2023, 5:29 PM IST

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సమాధి కట్టాలని  తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.


నిజామాబాద్:కేసీఆర్ కు సెలవుకు పలికేందుకు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.నిజామాబాద్ లో మంగళవారంనాడు నిర్వహించిన  ఇందూరు ప్రజా గర్జన  సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.వచ్చే రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని కిషన్ రెడ్డి  చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టేనని కిషన్ రెడ్డి ఆరోపించారు.రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పట్ల  రైతుల తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణలో రూ. 8వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రెండు రోజుల క్రితం పాలమూరులో కూడ బీజేపీ సభ విజయవంతంగా జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Latest Videos

undefined

రానున్న రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయన్నారు.తెలంగాణ గడ్డపై  కాషాయ జెండాను ఎగురవేయాలని ప్రజలు నిర్ణయంతో ఉన్నారని  కిషన్ రెడ్డి చెప్పారు.పాలమూరు, ఇందూరు సభలను చూడాలని కిషన్ రెడ్డి  హితవు పలికారు.

also read:త్వరలోనే భారతీయ రైల్వే ఎలక్ట్రిఫికేషన్: నిజామాబాద్‌లో రూ. 8వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించిన మోడీ

బీఆర్ఎస్, కాంగ్రెస్ లను ప్రజలు కోరుకోవడం లేదని కిషన్ రెడ్డి చెప్పారు.  తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ నెరవేర్చుతుందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పారు. గోల్కోండ కోటపై కాషాయ జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారన్నారు.తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేసినా కూడ బీజేపీపై ప్రజలు తమ విశ్వాసాన్ని కోల్పోదన్నారు.

click me!