ప్రధానమంత్రి గాల్లో లెక్కలు కట్టే మనిషి కాదు... ఇది తథ్యం: ధర్మపురి అరవింద్

By telugu teamFirst Published Dec 14, 2019, 11:00 AM IST
Highlights

రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై, ఎలా బలోపేతంచేయాలనుకుంటున్నామో ఎంపీలు వివరిస్తుండగానే నరేంద్రమోడీ తెలంగాణాలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్తుందని, రాబోయే రోజులు మనవే అని అన్నారట.  వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే గెలుపు అని ప్రధాని చెప్పినట్టు సమాచారం

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందని  తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు సమాచారం. శుక్రవారం పార్లమెంట్‌లో తెలంగాణ పార్లమెంటు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై మోడీ ఆరాతీయగా, ఎంపీలు పరిస్థితులను ప్రధానికి వివరించినట్టు తెలిసింది.

Also read: నిజామాబాద్ జిల్లా రైతులకు ఝలక్: అంతకు మించి అంటున్న ఎంపీ అరవింద్

రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై, ఎలా బలోపేతంచేయాలనుకుంటున్నామో ఎంపీలు వివరిస్తుండగానే నరేంద్రమోడీ తెలంగాణాలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్తుందని, రాబోయే రోజులు మనవే అని అన్నారట.  

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే గెలుపు అని ప్రధాని చెప్పినట్టు సమాచారం. 15 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని వారిని అడిగినట్టు తెలిసింది. 

పార్లమెంట్‌ సమావేశాల్లో పౌరసత్వం సవరణ బిల్లుకు తెరాస మద్దతు ఇవ్వకపోవడం గురించి ఎంపీలు ప్రధాని వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రధాని ప్రజల రియాక్షన్ ఎలా ఉందని కూడా అడిగారట. 

Also read: ఒకే వేదికపై పీకే, కవిత .. పవర్ పుల్ స్పిచ్‌కు రెడీ అవుతున్న టీఆర్ఎస్ మాజీ ఎంపీ

ఇక పౌరసత్వ బిల్లుపై తెలంగాణాలో ఎలాంటి పరిస్థితులున్నాయి అని అడగ్గా... అమల్లోకొచ్చి ఒక్కరోజు మాత్రమే అయినందున, తామిప్పుడే ఏమి చెప్పలేకపోతున్నామని వారు అన్నారట. 

ప్రధాని గాల్లో లెక్కలు కట్టే మనిషి కాదు... 

 తెలంగాణలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రధాని బలంగా నమ్ముతున్నారని నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్‌ మీడియాతో అన్నారు. ప్రధాని వద్ద క్షేత్రస్థాయి నివేదికలు ఉన్నాయి కాబట్టే తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారని, ఆయన గాల్లో లెక్కలు కట్టే మనిషి కాదని ఈ సందర్భంగా అరవింద్ అన్నారు. 

click me!