టోటల్ ఫ్యామిలీ దొంగలే.... పిల్లలను ఎరవేసి.. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి..

By telugu teamFirst Published Dec 14, 2019, 10:18 AM IST
Highlights

 మెహిదీపట్నం నివాసి పి.జయలక్ష్మి(69) సికింద్రాబాద్‌ నుంచి మెహిదీపట్నం వరకు బస్సులో వెళ్తున్నారు. తన బ్యాగ్‌లోని 25 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయని ఆమె ఆసి్‌ఫనగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
 

ఆ ఇంట్లో ఒకరు కాదు ఇద్దరు కాదు... టోటల్ ఫ్యామిలీ మొత్తం దొంగలే. వాళ్ల ఇంట్లోని పసి పిల్లలతో బస్సులు ఎక్కి... ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తారు. తమ పిల్లలను వారికి ఎరవేస్తారు. ఆ పిల్లలను వాళ్ల చుట్టూ తిరుగుతూ.. బ్యాగుల జిప్పులు తీయడం లాంటివి చేస్తారు. వాటిని అదునుగా చేసుకొని చాకచక్యంగా చోరీ చేస్తారు. తర్వాత ఆ సొత్తు అంతా... ఒక చోట చేరి పంచుకుంటారు. కాగా... ఈ ఫ్యామిలీ దొంగల ముఠా తాజాగా పోలీసులకు చిక్కింది.

ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఓ ముఠా గుట్టురటయ్యింది. ఈ ముఠాలోని నిందితులంతా మహిళలే కావడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.... బెంగళూరు, తిమ్మయ్యగార్డెన్, ఆర్టీనగర్ పోస్ట్ ప్రాంతానికి చెందిన గాయత్రి అలియాస్ కీర్తన అలియాస్ కవిత(31) ఈ ముఠాకి గ్యాంగ్ లీడర్. ఆమె కుప్పం వాస్తవ్యురాలు. కాగా.. నెలకు రెండు సార్లు హైదరాబాద్ నగరానికి తన ముఠాతో వస్తుంది.

ఆమె భర్త రాజు(35), సోదరి కోకిల(30), వదిన జ్యోతి(38) ఆమె స్నేహితురాలు అనిత తో కలిసి వీరు ముఠాగా ఏర్పడ్డారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో 13 చోరీలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. నిందితులు నలుగురు పట్టుబడగా.. అనిత పరారీలో ఉంది.

గత నెల 29వ తేదీ సాయంత్రం మెహిదీపట్నం నివాసి పి.జయలక్ష్మి(69) సికింద్రాబాద్‌ నుంచి మెహిదీపట్నం వరకు బస్సులో వెళ్తున్నారు. తన బ్యాగ్‌లోని 25 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయని ఆమె ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజీలు, సాంకేతికత సాయంతో నిందితులను గుర్తించి నిఘా పెట్టారు. శుక్రవారం మరోసారి చోరీ చేయడానికి ముఠాలోని నలుగురు నగరానికి చేరుకోగానే పట్టుకున్నారు. పరారీలో ఉన్న అనిత కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 35 తులాల బంగారు ఆభరణాలు, రూ. 8 లక్షలు మొత్తం రూ. 20 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

click me!