
కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉప ఎన్నిక కోసం ప్రచారంలో దిగిన బిజెపి, టీఆర్ఎస్ శ్రేణులు తాజాగా భాహాభాహీకి దిగారు. గురువారం టీఆర్ఎస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనకు వ్యతిరకంగా బిజెపి శ్రేణులు కూడా నిరసనకు దిగాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తలు హుజురాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ ఎదురెదుగా వచ్చారు. దీంతో పోటీపోటీగా నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు ఇరు వర్గాలను అదుపుచేశారు.
వీడియో
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దళితులను కించపరిచే విధంగా ఛాటింగ్ చేశారంటూ ఓ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ అనుకూల దళితులు నిరసనకు దిగగా, ఇది తప్పుడు ప్రచారమంటూ ఈటల అనుకూల దళిత వర్గాలు కూడా నిరసన చేపట్టారు. దీంతో హుజురాబాద్ లో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
read more హుజురాబాద్ ఉప ఎన్నిక: కేసీఆర్ అహంకారానికి నాకు మధ్యే పోరు.. ఈటల వ్యాఖ్యలు
మాజీ మంత్రి ఈటల సతీమణి జమున సోదరుడు మధుసూధన్ రెడ్డి దళితులను కించపరిచే విధంగా ఛాటింగ్ చేశాడంటూ దళిత సంఘాల నిరసనకు దిగాయి. అయితే ఈటలను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మరో దళిత సంఘం నిరసనకు దిగింది. ముఖ్యమంత్రి కేసీఅర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసింది. టీఆర్ఎస్ ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటు హుజూరాబాద్ లో ఈటల జమున భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగి రాస్తారోకో చేపట్టారు.
''చాలా చిన్నవాటికే ఆశపడతారు ఆశపడతారు నా కొడుకులు...వారిని నమ్మలేం'' అంటూ ఈటల జమునారెడ్డి సోదరుడు కొండవీటి మధుసూదన్ రెడ్డి అన్నట్లుగా ఓ వాట్సాఫ్ చాట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ ఛాటింగ్ లో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వుంది. ఇక దళిత బంధు పథకం ఎన్నికల్లో ఇబ్బంది కావొచ్చంటూనే ఈటల బామ్మర్ది దళితులను కులం పేరుతో దూషించడంపై దుమారం రేగుతోంది.