సెప్టెంబర్‌ 17న నిర్మల్‌లో తెలంగాణ విమోచన సభకు అమిత్ షా: సోయం బాపురావు

Published : Sep 07, 2021, 03:09 PM IST
సెప్టెంబర్‌ 17న నిర్మల్‌లో తెలంగాణ విమోచన సభకు అమిత్ షా: సోయం బాపురావు

సారాంశం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది బీజేపీ, ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు ప్రకటించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బాపురావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీన నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరౌతారని  ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ తో ఈ నెల 17న నిర్మల్ కేంద్రంగా బీజేపీ ఈ సభను ఏర్పాటు చేసింది. 

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొనే ఈ సభను ఘనంగా నిర్వహిస్తామన్నారు. నిజాం నిరంకుశ పాలన పై కొమరం భీమ్ పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ డిమాండ్ చేసిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.సెప్టెంబర్ 17న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూడ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సభ ఎక్కడ అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu