తెలంగాణ బీజేపీ నేతలు డమ్మీలు.. కేసీఆర్, అమిత్ షా ఆటలో బండి బలవ్వాల్సిందే: జగ్గారెడ్డి

Siva Kodati |  
Published : Sep 07, 2021, 03:08 PM IST
తెలంగాణ బీజేపీ నేతలు డమ్మీలు.. కేసీఆర్, అమిత్ షా ఆటలో బండి బలవ్వాల్సిందే: జగ్గారెడ్డి

సారాంశం

కేసీఆర్, అమిత్ షా ఆటలో బండి సంజయ్ బలికాక తప్పదని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. ఢిల్లీ నుంచి ఏడేళ్లుగా ఎన్ని నిధులు తెచ్చారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారం కాపాడుకోవడానికే బీజేపీతో దోస్తీ చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. 

తెలంగాణ బీజేపీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పవర్ అంతా ఢిల్లీ చేతిలోనే  వుందని.. రాష్ట్ర బీజేపీ కమిటీకి పవర్ లేదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ గల్లీలో కేసీఆర్‌ను తిడుతున్నాడని.. ఢిల్లీలో బీజేపీ నేతలతో కేసీఆర్ తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్, అమిత్ షా ఆటలో బండి సంజయ్ బలికాక తప్పదని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. ఢిల్లీ నుంచి ఏడేళ్లుగా ఎన్ని నిధులు తెచ్చారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారం కాపాడుకోవడానికే బీజేపీతో దోస్తీ చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ తెలంగాణ నాయకులు డమ్మీలని.. బండి సంజయ్ బకరా నెం 1, ఈటల రాజేందర్ బకరా నెం .2 అంటూ ఆయన దుయ్యబట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం