భారీ వర్షాల ఎఫెక్ట్: వేములవాడలో కుప్పకూలిన వంతెన

By narsimha lodeFirst Published Sep 7, 2021, 2:54 PM IST
Highlights

వేములవాడ పట్టణంలోని మూలవాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మూలవాగులో వరద పోటెత్తింది, ఈ వాగులో వరద కారణంగా వంతెన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ కుప్పకూలింది.

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ బస్టాండ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. వారం రోజులకు పైగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వేములవాడలో మూలవాగుపై కొత్తగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

దీంతో ఈ వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం సెంట్రింగ్ ఏర్పటు చేశారు. ఈ వాగులో నీటి ప్రవాహానికి  సెంట్రింగ్ కుప్పకూలిపోయింది.వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం  వేర్వేరుగా రహదారి సౌకర్యం కల్పించేందుకుగా ఈ వాగుపై బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 28 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 

 తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్  జారీ చేసింది మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్లకు ఆరెంజ్ ఆలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైద్రాబాద్ తో పాటు ఇతర జిల్లాలలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది ప్రభుత్వం. భద్రాద్రి , వరంగల్ , నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

click me!