నేటీతో ముగియనున్న బీజేపీ శిక్షణ తరగతులు: రాష్ట్ర కార్యవర్గంలో కీలక తీర్మానాలు

By narsimha lode  |  First Published Nov 22, 2022, 9:50 AM IST

బీజేపీ  శిక్షణ  తరగతులు  ఇవాళ్టితో  ముగియనున్నాయి.  ఇవాళ  మధ్యాహ్నం  బీజేపీ  రాష్ట్ర  కార్యవర్గ సమావేశాన్ని  నిర్వహిస్తారు.ఈ సమావేశంలో  పలు  కీలక అంశాలపై  తీర్మానం చేయనున్నారు.
 


హైదరాబాద్:బీజేపీ శిక్షణ తరగతులు  ఇవాళ్టితో  ముగియనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం  బీజేపీ  రాష్ట్ర  కార్యవర్గం సమావేశం  కానుంది.  ఈ  సమావేశంలో  వచ్చే  ఎన్నికల్లో  అధికారం చేజిక్కించుకోవడంపై  తీర్మానం చేయనున్నారు. అంతేకాదు  రాష్ట్రంలో  తాజా రాజకీయ పరిస్థితులు,  టీఆర్ఎస్  నమోదు చేస్తున్న  కేసులపై  బీజేపీ  నేతలు  చర్చించనున్నారు.

ఈ నెల  20వ  తేదీన  మధ్యాహ్నం  హైద్రాబాద్ కు  శివారులోని  షామీర్ పేటలో గల రిసార్ట్స్ లో  శిక్షణ  తరగతులు  ప్రారంభమయ్యాయి.   ఈ  శిక్షణ తరగతుల్లో  పలువురు  బీజేపీ నేతలు  పాల్గొన్నారు.  ఈ  ట్రైనింగ్  క్యాంపులో  బీజేపీ సంస్థాగత  వ్యవహరాల  ఇంచార్జీ  బీఎల్  సంతోష్ కూడా  పాల్గొనాల్సి  ఉంది.  అయితే  ఆయన  మాత్రం  ఈ   శిక్షణ  తరగతులకు  హాజరు కాలేదు. ఎమ్మెల్యేలకు  ప్రలోభాల  కేసులో  సిట్  బీఎల్  సంతోష్ కు  నోటీసులు  జారీ చేసింది.  సిట్  విచారణకు  బీఎల్  సంతోష్  నిన్న  హాజరు కావాల్సి ఉంది. కానీ సిట్  విచారణకు  బీఎల్  సంతోష్  హాజరు కాలేదు.  

Latest Videos

undefined

పార్టీ  సిద్దాంతాలు, లక్ష్యాలపై  అగ్రనేతలు  రాష్ట్ర  నేతలకు  వివరించనున్నారు.  ఒక్కో  అంశంపై బీజేపీ  నాయకత్వం  45  నుండి  గంటకుపైగా  ప్రసంగించారు. పార్టీ  ఆవిర్భావం,  పార్టీ లక్ష్యాలు, ప్రతికూల పరిస్థితుల్లో  పార్టీని  ముందుకు నడిపించడం  వంటి  అంశాలపై  బీజేపీ  నాయకత్వం శిక్షణ  ఇచ్చింది.ఇటీవల  కాలంలో  ఇతర పార్టీల నుండి  బీజేపీలో చేరారు. వీరందరికి  పార్టీ సిద్దాంతాలపై అవగావన  కల్పించాలనే  ఉద్దేశ్యంతో ఈ  శిక్షణ  తరగతులు  ఏర్పాటు  చేశారు.

ఇవాళ బీజేపీ  తెలంగాణ  రాష్ట్ర  కార్యవర్గ సమావేశం  జరగనుంది. ఈ సమావేశంలో  పలు  అంశాలపై  పార్టీ  నేతలు  చర్చించనున్నారు.  రాష్ట్రంలో  ఉన్న  రాజకీయ  పరిస్థితులపై  చర్చించనున్నారు. రాష్ట్రంలో  రాజకీయ  పరిస్థితుల ఆధారంగా  అనుసరించాల్సిన  వ్యూహంపై  బీజేపీ  నాయకత్వం  కార్యాచరణను  సిద్దం చేయనుంది. బీజేపీ  తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షుడు  బండి సంజయ్  ప్రజా సంగ్రామ  యాత్రను  ఈ నెల  చివరి వారంలో  బైంసా నుండి ప్రారంభించనున్నారు.ఈ యాత్రపై  కూడా  బీజేపీ  రాష్ట్ర  కార్యవర్గ  సమావేశంలో చర్చిస్తారు.

click me!