మంత్రి మల్లారెడ్డి ఇళ్లల్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో తనిఖీలు...

By SumaBala Bukka  |  First Published Nov 22, 2022, 8:24 AM IST

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఆయనకు, ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్ల మీద ఏకకాలంలో 50 బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. 


హైదరాబాద్ : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని మల్లా రెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఆయన, అల్లుడు నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు ఏకకాలంలో ఆయన కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు.  మంగళవారం తెల్లవారుజాము నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కాలేజీ లకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. 

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మల్లారెడ్డికి సంబంధించిన బంధువుల ఇళ్లల్లో కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో మొత్తం యాభై చోట్ల ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తుంది. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా మల్లారెడ్డి కూతురు, కొడుకు అల్లుడు నివాసాలతోపాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరాతీస్తున్నారు. ఐటీ రిటర్న్స్ చెల్లింపులకి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు. 

Latest Videos

గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, నేతల ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మల్లారెడ్డి బాగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ గెలుపు కోసం ఎక్కువగా శ్రమించిన నేతల్లో మల్లారెడ్డి కూడా ఒకరిని చెప్పాలి. అక్కడి స్థానికులకు మందు పార్టీలు ఇచ్చారని, ఆయనే స్వయంగా మందు పోస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించిన కాంగ్రెస్ శ్రేణులు..

ఈ దాడులకు ముందు రోజే ప్రధానిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి ఆటలు సాగవని 2024లో దేశానికి కేసీఆరే ప్రధాని అంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కామెంట్స్ చేసిన కొద్ది గంటల్లోనే మంత్రి ఇంటిపై తనిఖీల పేరుతో ఐటి దాడులు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది 

click me!