ఢిల్లీకి బండి సంజయ్: జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత తొలిసారి హస్తినకు

By narsimha lodeFirst Published Dec 6, 2020, 10:58 AM IST
Highlights

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నాడు ఢిల్లీ వెళ్లారు. జీహెచ్ఎంసీ ఎ్ననికల ఫలితాల తర్వాత సంజయ్ తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు.


హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నాడు ఢిల్లీ వెళ్లారు. జీహెచ్ఎంసీ ఎ్ననికల ఫలితాల తర్వాత సంజయ్ తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. 2016 ఎన్నికల్లో బీజేపీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 48 స్థానాల్లో గెలుపొంది టీఆర్ఎస్ కు సవాల్ విసిరింది.

also read:రేపు బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ విజయశాంతి

గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఈ దఫా ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ  సత్తా చాటింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. బీజేపీ అగ్రనేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ ఈ ఎన్నికల ఇంచార్జీగా వ్యవహరించారు. ప్రతి డివిజన్ లో కీలక నేతలను ఇంచార్జీలుగా నియమించిన ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటును బీజేపీ తన వైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను బండి సంజయ్ కలవనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల సరళిపై ఆయన వివరించనున్నారు.


 

click me!