రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసుల సోదాలు: బండి సంజయ్ అరెస్ట్

By narsimha lodeFirst Published Oct 26, 2020, 8:02 PM IST
Highlights

రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసుల సోదాల విషయం తెలుసుకొని సిద్దిపేటకు వెళ్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలను  పోలీసులు అడ్డుకొన్నారు. వారిని అరెస్ట్ చేశారు. 
 

సిద్దిపేట:  రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసుల సోదాల విషయం తెలుసుకొని సిద్దిపేటకు వెళ్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిలను  పోలీసులు అడ్డుకొన్నారు. వారిని అరెస్ట్ చేశారు. 

దుబ్బాక అసెంబ్లీ  ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు సమీప బంధువుల ఇళ్లలో సోమవారం నాడు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొడవ జరిగింది. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. పోలీసులు స్వాదీనం చేసుకొన్న నగదును బీజేపీ కార్యకర్తలు ఎత్తుకెళ్లారు.

also read:రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో సోదాలు: సిద్దిపేటలో ఉద్రిక్తత

ఈ విషయం తెలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని పోలీసులు సిద్దిపేటకు రాకుండా అడ్డుకొన్నారు. వారిని మార్గమధ్యలోనే అడ్డుకొని కరీంనగర్ కు పోలీసులు తరలిస్తున్నారు.

దుబ్బాకలో ఎన్నికలు జరిగితే సిద్దిపేటలో పోలీసులు ఎందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. పోలీసులు సోదాల విషయం తెలుసుకొన్న రఘునందన్ రావు సిద్దిపేటకు చేరుకొని అక్కడ ధర్నా నిర్వహించారు.

 


 

click me!