రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో సోదాలు: సిద్దిపేటలో ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Oct 26, 2020, 2:53 PM IST
Highlights

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు  ఇంట్లో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.
 

సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు  ఇంట్లో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.

రఘునందన్ రావుకు చెందిన బంధువుల ఇళ్లతో పాటు ఆయన కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలోని రఘునందన్ రావు బంధువుల ఇంట్లో రూ. 18 లక్షల 65  వేల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న  రఘునందన్ రావు అక్కడికి చేరుకొన్నారు. బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లోకి వెళ్లిన బీజేపీ కార్యకర్తలు నగదును కొంత తీసుకెళ్లినట్టుగా సమాచారం. ఈ సమయంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ గొడవ కారణంగా బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు స్పృహ కోల్పోొయినట్టుగా చెబుతున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రఘునందన్ రావు ధర్నాకు దిగాడు.

గత మాసంలో హైద్రాబాద్ శివారులో పోలీసులు సుమారు రూ. 45 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు చెందిన డబ్బులుగా పోలీసులు ప్రకటించారు.

also read:దుబ్బాక బైపోల్: రూట్ మార్చిన కాంగ్రెస్, ఠాగూర్ మార్క్ రాజకీయం

బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు  పీఏతో  డబ్బులు తరలిస్తున్నవారు ఫోన్ లో సంభాషించినట్టుగా గత మాసంలో పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో  ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. 

click me!