బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఇవాళ మహబూబ్ నగర్ ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
మహబూబ్ నగర్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మంగళవారం నాడు మహబూబ్ నగర్ లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో వ్యూహరచన చేయనున్నారు. బీజేపీ అగ్రనేత సునీల్ భన్సల్ ఈ సమావేశాలకు హాజరయ్యారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ జాతీయ నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే . ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కూడా తెలంగాణ విషయమై చర్చించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ధీమాతో బీజేపీ నాయకత్వం ఉంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రాజకీయ తీర్మానంతో పాటు , వ్యవసాయంపై తీర్మానం చేయనున్నారు. అంతేకాదు సామాజిక అంశాలపై కూడా తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించనుంది.