మేడ్చల్ జిల్లాలో వైన్స్ దుకాణం వద్ద కాల్పులు: రూ. 2 లక్షలు దోచుకున్న దుండగులు

By narsimha lode  |  First Published Jan 24, 2023, 9:21 AM IST


మేడ్చల్ జిల్లాలోని  ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద  దుండగులు కాల్పులకు దిగారు. మద్యం దుకాణం నుండి  రూ. 2 లక్షలు దోచుకున్నారు. 


హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని  మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో  సోమవారం నాడు రాత్రి కాల్పుల కలకలం చోటు  చేసుకుంది.  ఓ మద్యం దుకాణం నుండి  రూ. 2 లక్షలను తీసుకెళ్తున్న దుకాణ సిబ్మందిపై   ముగ్గురు వ్యక్తులు  దాడికి దిగారు. మంకీ క్యాపులు ధరించిన  వ్యక్తులు  మద్యం దుకాణం సిబ్బందిని బెదిరించారు. డబ్బులు ఇవ్వాలని కోరారు.  డబ్బులు ఇచ్చేందుకు మద్యం దుకాణ సిబ్బంది నిరాకరించారు. దీంతో   మద్యం దుకాణ సిబ్బందిపై  దుండగులు దాడికి దిగారు.మద్యం దుకాణ సిబ్బంది ప్రతిఘగించారు.

దీంతో  దుండగగులు తమ వెంట తెచ్చుకున్న  తుపాకీతో  కాల్పులకు దిగారు. మద్యం దుకాణ సిబ్బంది  నుండి  రూ. 2 లక్షలను దోచుకున్నారు.  కాల్పుల నుండి దుకాణ సిబ్బంది తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలో మద్యం దుకాణం షట్టర్ కు బుల్లెట్ తగిలింది. దుండగులు కాల్పులకు దిగడంతో  దుకాణ సిబ్బంది షాక్ కు గురయ్యారు వెంటనే దుండగులు  రూ. 2 లక్షలు తీసుకొని పారిపోయారు.   దుండగులు పారిపోతున్న సమయంలో  దుకాణ సిబ్బంది  కేకలు వేశారు. దుండగులను  పట్టుకొనేందుకు  స్థానికులు  ప్రయత్నించారు.

Latest Videos

 అయితే దుండగులు పారిపోతూ కాల్పులకు దిగారు. దీంతో   స్థానికులు భయపడ్డారు.   ఈ ఘటనకు సంబంధించి  మద్యం దుకాణ సిబ్బంది  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు ఆదారంగా  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.  దుండగుల కోసం  పోలీసులు  ఐదు టీమ్ లతో గాలింపు చర్యలు చేపట్టారు.

డబ్బులు  ఇవ్వాలని హిందీలో అడిగారు: బాలకృష్ణ

రాత్రి పూట  మద్యం దుకాణం మూసివేసి  డబ్బుతో  ఇంటికి వెళ్లే సమయంలో ముగ్గురు దుండగులు  వచ్చినట్టుగా  ఈ దాడిలో  గాయపడిన  ఇద్దరు  చెప్పారు.  మద్యం దుకాణ యజమాని  బాలకృష్ణ, అతనితో పాటు  ఈ ఘటనలో గాయపడిన జైపాల్ రెడ్డిని దుండగులు కొట్టారని  బాలకృష్ణారెడ్డి మీడియాకు  చెప్పారు. ఈ దుండగులు  తొలుత మద్యం కోసం వచ్చినట్టుగా తాము  భావించినట్టుగా  చెప్పారు. మద్యం దుకాణం మూసివేసినట్టుగా  చెప్పామన్నారు. అయితే  డబ్బులు ఇవ్వాలని హిందీలో  అడిగారని మద్యం దుకాణ యజమాని బాలకృష్ణ  చెప్పారు

.  ఈ సమయంలో  డబ్బుల సంచి  జైపాల్ రెడ్డి వద్ద  ఉందన్నారు.   తనకు దుండగులు తుపాకీని పెట్టి బెదిరించారన్నారు. డబ్బు సంచి  ఇవ్వకుండా  జైపాల్ రెడ్డి  దుండగులతో పొరాడినట్టుగా బాలకృష్ణ మీడియాకు తెలిపారు. తనపై దుండగుడు తుపాకీతో కాల్పులకు దిగినట్టుగా  చెప్పారు. ఆ సమయంలో తాను  పక్కకు తప్పుకోవడంతో  బుల్లెట్  దుకాణం  షట్టర్ కు తగిలిందన్నారు.జైపాల్ రెడ్డిని దుండగులు  కర్రతో   తీవ్రంగా  కొట్టారని  బాలకృష్ణ చెప్పారు. 

click me!