
న్యూఢిల్లీ: Telangana పై పార్లమెంట్ లో ఓటింగ్ జరిగే సమయంలో KCRఎక్కడున్నాడని బీజేపీ తెలంగాణ చీఫ్ Bandi Sanjayప్రశ్నించారు. బుధవారం నాడు బండి సంజయ్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనపై ప్రధాని Narendra Modi మంగళవారం నాడు Rajyasabhaలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని బండి సంజయ్ అన్నారు.. అదే రీతిలో TRS కన్పిస్తుందన్నారు.ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసింది BJPయేనని ఆయన గుర్తు చేశారు. ఈ తీర్మానం చేయడంతోనే TDP నుండి కేసీఆర్ బయటకు వచ్చావని బండి సంజయ్ కేసీఆర్ పై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ వక్రీకరిస్తుందన్నారు.
Vajpayee ప్రధానిగా ఉన్న సమయంలో జార్ఖండ్, ఛత్తీష్‌ఘడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలో పెప్పర్ స్ప్రే కొట్టలేదన్నారు. ఎలాంటి అశాంతి వాతావరణం చోటు చేసుకోలేదన్నారు. ఈ మూడు రాష్ట్రాల ఏర్పాటు సమయంలో అందరితో చర్చించామన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా చర్చ జరగలేదనే విషయాన్ని ప్రధాని మోడీ గుర్తు చేశారని బండి సంజయ్ వివరించారు.
తెలంగాణ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరిగే సమయంలో కేసీఆర్ ఎక్కడికి పోయాడని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ఈ విషయమై చర్చ సాగినప్పుడు కేసీఆర్ ఎందుకు లేడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటింగ్ సమయంలో కూడా కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో చెప్పాలన్నారు. కానీ ఓటింగ్ సమయంలో విజయశాంతి ఒక్కరే పాల్గొన్నారని ఆయన తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారిని కేసీఆర్ తన వద్ద పెట్టుకొన్నారన్నారు. తెలంగాణ ఉద్యమ కారులను కొట్టిన వారికి కేసీఆర్ మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. ఈ విషయమై తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకొన్న అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణ విషయమై బిల్లు పెడుతారో లేదో తేల్చి చెప్పాలని అప్పటి బీజేపీ పక్ష నేత సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ ను నిలదీయడంతోనే భయంతోనే కాంగ్రెస్ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టిందన్నారు.తెలంగాణపై సెంటిమెంట్ ను రగిల్చేందుకు కేసీఆర్ ప్రధాని వ్యాఖ్యలను తెరమీదికి తెస్తున్నాడన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ మరోసారి డ్రామాకు తెరలేపారని ఆయన చెప్పారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఈ సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన గురించి మోడీ మాట్లాడారు. Andhra pradesh రాష్ట్ర విభజనపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. రాష్ట్ర విభజన సరిగా చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని ఆయన చురకలంటించారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని Prime Minister మోడీ స్పష్టం చేశారు. విభజన జరిగిన తీరును మాత్రం ఆయన తప్పుబట్టారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఇచ్చిన ఏపీకి అన్యాయం చేశారని మోడీ గుర్తు చేశారు. హడావుడిగా రాష్ట్ర విభజన చేశారని మోడీ మండిపడ్డారు.