
Telangana VRA: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ)ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు గా సేవలందిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రమోషన్లు. ఇంక్రిమెంట్లు లేకపోవడంతో దయనీయంగా మారింది. వీఆర్వోల వ్యవస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తమ భవిష్యత్తు ఏమైందోననే భయాందోళనల్లో వీఆర్‌ఏలు ఉన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేయడంతో గత 15 నెలలుగా 5,485 మంది ఉద్యోగుల భవితష్యం ప్రశ్నార్థకంగా మారింది. గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేసి ఏడాదిన్నర గడుస్తున్నా.. తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకూ వారికి జాబ్ చార్ట్‌ను ప్రకటించలేదు. దీంతో వారికి రావాల్సిన ప్రమోషన్లు. ఇంక్రిమెంట్లు, డిపార్ట్మెంటల్ టెస్టులు, ట్రాన్స్‌ఫర్స్‌ను కోల్పోయారనే ఆరోపిస్తున్నాయి. పలు మార్లు ఆందోళన బాట పట్టిన ఫలితం లేదు.
ఈ నేపథ్యంలో తమను రెవెన్యూలోనే కొనసాగిస్తారా? రెవెన్యూలోనే కొనసాగిస్తే.. ఎంతమందిని కొనసాగిస్తారు? లేదా.. ఇతర శాఖలకు పంపుతారా? అసలు ఉద్యోగాలను ఉంచుతారా? తీసేస్తా రా? అనే పలు సందేహాలు వీఆర్‌ఏ ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో తమకు పేస్కేలు ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించారని రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌ఏలు ఆందోళన బాట పట్టారు.
క్షేత్రస్థాయిలో జరిగే రెవెన్యూ కార్యకలాపాలకు వీఆర్‌ఏలు సహాయకులుగా ఉంటారు. వీరిలో కొందరిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయగా, చాలామందిని నేరుగానే నియమించింది. 2007 నుంచి వీరికి నెలకు రూ.10,500 జీతం ఇస్తున్నారు. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో వారికి రూ.11,400, పట్టణ ప్రాంతాల్లో రూ.11,500 ల జీతాన్ని చెల్లిస్తున్నారు. అయితే తమకు ఉద్యోగ భద్రత కల్పించి.. పేస్కేల్ ఇవ్వాలని వీఆర్‌ఏలు డిమాండ్ చేస్తున్నారు.
పేస్కేల్ అమలైతే.. హెల్త్‌కార్డులు, టీఏ, డీఏలు, ఇతర అల వెన్సులు వర్తిస్తాయి. 2020 సెప్టెంబరు 9న అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదిస్తూ.. వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేసి వీఆర్‌ఏలకు పేస్కేలు ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే.. పదోన్నతులు ఇస్తామని, వారసత్వ ఉద్యోగాలకు అవకాశమిస్తామని కూడా హామీ ఇచ్చారు. వీటితో పాటు డైరెక్ట్ వీఆర్‌ఏల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది.
రాష్ట్రంలోని వీఆర్‌ఏలను మూడు రకాలుగా వర్గీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం. అందులో 3,300 మందికి పైగా వీఆర్‌ఏలను సాగునీటి శాఖకు, ఇక మిగిలిన వారిని స్కిల్డ్, అన్‌స్కిల్డ్ గాలు నియమించాలని దానిపై దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. స్కిల్డ్ ఉద్యోగులను రెవెన్యూలోనే కొనసాగించాలని, గ్రామానికొకరిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలో వీఆర్‌ఏలు సోమ, మంగళ వారాల్లో ధర్నాలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్‌ఏ, వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వీఆర్‌ఏల సంఘం గౌరవాధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ కోరారు.
Telangana VRA వీఆర్‌ఏల డిమాండ్స్
♦ పేస్కేల్ వర్తింపజేయాలి.
♦55 ఏళ్లు పైబడిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు.
♦అర్హులైన వీఆర్‌ఏలకు వెంటనే పదోన్నతి.
♦ అందరికీ సొంత గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు.
♦ పీఆర్‌సీ జీవోలను విడుదల
♦విధుల్లో భాగంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి.