బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీమ్: తెలంగాణలో మాదే అధికారమన్న బండి సంజయ్

By narsimha lode  |  First Published Feb 14, 2023, 2:05 PM IST

బీఆర్ఎస్, కాంగ్రెస్ లు  రెండూ ఒక్కటేనని  బీజేపీ విమర్శించింది.  ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని బండి సంజయ్  చెప్పారు. 
 



న్యూఢిల్లీ: బీఆర్ఎస్ కు  కాంగ్రెస్ పార్టీ బీ టీమ్ అని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  విమర్శించారు. తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల  రంగం నుండి తప్పుకుందని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు  సూచిస్తున్నాయన్నారు. 

న్యూఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  తరుణ్ చుగ్ తో కలిసి   మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  బీజేపీని ఎదుర్కోవడానికి   బీఆర్ఎస్,, కాంగ్రెస్ పార్టీలు  వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని  బండి సంజయ్  చెప్పారు. ఎన్నికల వరకు  ఈ రెండు పార్టీలు  కొట్లాడినట్టుగా  నటిస్తున్నాయన్నారు.  బీఆర్ఎస్, కాంగ్రెస్ లు దండుపాళ్యం ముఠాగా  ఆయన అభివర్ణించారు.  వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందని  బండి సంజయ్  చెప్పారు. అంతేకాదు తమ పార్టీ  అధికారాన్ని కైవసం  చేసుకుంటుందని  ఆయన  ధీమాను వ్యక్తం  చేశారు. 

Latest Videos

undefined

కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారంతా  బీఆర్ఎస్ లో  చేరారన్నారు.  ఈ దఫా కూడా అదే పరిస్థితి ఉంటుందని  బండి సజంయ్  అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు ఓటేసినట్టేనని  బండి సంజయ్  చెప్పారు. తమ పార్టీకి  తెలంగాణలో ఒక్క సీటు  రాదని  కేసీఆర్ అంటున్నారని  మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బండి సంజయ్  సమాధానం ఇచ్చారు.  తమకు  ఒక్క సీటు  రాకపోతే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఆయన  ప్రశ్నించారు. తమ పార్టీకి భయపడే  కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు  చేశారని ఆయన  చెప్పారు.  బీజేపీకి భయపడే  కాంగ్రెస్,, బీఆర్ఎస్ లు  కలిసి పోటీ చేస్తాయని  ఆయన  చెప్పారు.  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో  కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పై  ఒక్క మాట మాట్లాడని విషయాన్ని కూడా  బండి సంజయ్  గుర్తు చేశారు. అసెంబ్లీలో మోడీని  ఈ రెండు పార్టీలు  తిట్టడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. అసెంబ్లీలో  ఈటల రాజేందర్  పేరును కేసీఆర్ పదే పదే ప్రస్తావించడంపై  మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు  బండి సంజయ్  స్పందించారు. కేసీఆర్ కు మతి తప్పిందన్నారు.  ఈటల రాజేందర్ ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాడనే భ్రమలో కేసీఆర్ ఉన్నాడన్నారు.

also read:2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు :కోమటిరెడ్డి సంచలనం

తెలంగాణ సీఎం కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నాడని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్  చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ పై  ఉందన్నారు.  తెలంగాణలో  మోడీ , అమిత్ షా,  రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డాలు విస్తృతంగా పర్యటించేలా  ప్లాన్ రూపొందిస్తున్నామని  తరుణ్ చుగ్  తెలిపారు.
 

click me!