ఇస్సపల్లిలో టీఆర్ఎస్, బీజేపీ ఘర్షణ: నిజామాబాద్ టూర్‌కి బండి సంజయ్

Published : Jan 27, 2022, 11:28 AM ISTUpdated : Jan 27, 2022, 11:37 AM IST
ఇస్సపల్లిలో టీఆర్ఎస్, బీజేపీ ఘర్షణ:  నిజామాబాద్ టూర్‌కి బండి సంజయ్

సారాంశం

నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లిలో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన  తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు బండి సంజయ్  గురువారం నాడు నిజామాబాద్ టూర్ కు వెళ్లారు.

హైదరాబాద్: ఇస్సపల్లిలో టీఆర్ఎస్ వర్గాల దాడిలో గాయపడిన  కార్యకర్తలను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం నాడు  నిజామాబాద్ జిల్లాకు బయలుదేరారు.

 నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లడానికి ముందు Bandi Sanjay  గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. Armur సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు సమన్వయ సమితి ప్రకటించిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. రాళ్లు పట్టుకొనే నేతలు Telangana లో లేరని సంజయ్ అభిప్రాయపడ్డారు.

ఇస్సపల్లిలో తమ పార్టీ ఎంపీ Dharmapuri arvind సహా, BJP శ్రేణులపై జరిగిన దాడిలో ఎవరున్నారో ప్రజలందరికి తెలుసునని ఆయన చెప్పారు. ఏమైనా సమస్యలుంటే రైతులు కూర్చొని చర్చించుకొంటారని బండి సంజయ్ తెలిపారు.

ప్రధాని మోడీ కాన్వాయ్ ను అడ్డగించిన ఖలిస్తాన్  సంస్థకు మద్దతుగా మాట్లాడే నేతలు టీఆర్ఎస్ లో ఉన్నారని  బండి సంజయ్ మండిపడ్డారు.ఈ నెల 25న ఇస్సపల్లిలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ వాహనంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. ఈ దాడిలో ఎంపీ వాహనం ధ్వంసమైంది. పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. బీజేపీ, TRS వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

 నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎంపీని అడ్డుకోవడం, అక్కడికి బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఘర్షణ జరిగింది.  నందిపేట మండలంలోని నూత్‌పల్లి, చిన్నయానం, అన్నారం గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఎంపీ అర్వింద్‌ ఆర్మూర్‌లోని తన ఇంటి నుంచి  బయలుదేరారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ అనుబంధ రైతు సంఘాలకు చెందిన కార్యకర్తలు, రైతులు పసుపు బోర్డుపై ఎంపీని నిలదీసేందుకు ఆర్మూర్‌ మండలం దేగాం, ఆలూరులో రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. ఈ రెండు గ్రామాలతో పాటు ఎంపీ వెళ్లే ఇతర గ్రామాల్లో కూడా రైతులు ఎంపీని నిలదీసేందుకు సిద్ధం కావడంతో పోలీసులు ఆ మార్గంలో వెళ్లొద్దని అర్వింద్‌కు సూచించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ.. ఆర్మూర్‌లోని మామిడిపల్లి చౌరస్తా వద్ద 2 గంటలు ధర్నా చేశారు. 

అక్కడి నుంచి ఆర్మూర్‌ మీదుగా ఇస్సపల్లికి చేరుకున్నారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో.. ఇరు పార్టీల వారు తోపులాటకు దిగారు. ఎంపీ సమక్షంలోనే పరస్పర దాడులకు పాల్పడ్డారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు భారీగా తరలిరావడంతో వారి నుంచి తప్పించుకునేందుకు బీజేపీ కార్యకర్తలు పొలాల వెంట పరుగెత్తారు. వారిని టీఆర్‌ఎస్‌ శ్రేణులు వెంటపడి తరిమి చితకబాదాయి. ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎంపీ వాహనంతో పాటు పలువురి వాహనాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ కార్యకర్తలతో పాటు తనపై దాడి ఘటనకు సంబంధించి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రకటించారు. టీఆర్ఎస్ నేతలకు పోలీసులు మద్దతుగా నిలిచారని ఆయన ఆరోపించారు.ఈ విషయాన్ని పోలీసులకు ముం దుగానే చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. దాడులకు పాల్పడిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్వింద్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!